Shashi Tharoor | వైద్యుల భద్రత కోసం ప్రత్యేక బిల్లు : శశి థరూర్ డిమాండ్
Shashi Tharoor : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో జరిగిన దుర్ఘటనతో దేశం ఉలిక్కిపడింది. వైద్యరాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
Shashi Tharoor : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో జరిగిన దుర్ఘటనతో దేశం ఉలిక్కిపడింది. వైద్యరాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. వైద్యుల పట్ల తాను సానుభూతి వ్యక్తం చేస్తూ వారికి సంఘీభావం తెలుపుతున్నానని చెప్పారు.
వైద్యులపై జరుగుతున్న హింస గురించి తాను గత రెండేండ్లుగా పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నానని, ఈ అంశంపై అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో వాదన జరిగిందని గుర్తుచేసుకున్నారు. విధి నిర్వహణలో ఉండే వైద్యుల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ బిల్లును తీసుకురావాలని తాను వాదించానని చెప్పారు. తనకు ప్రభుత్వం నుంచి విచిత్రమైన సమాధానం వచ్చిందని చెప్పారు.
ఒక వృత్తికి ఇలాంటి భద్రతతో కూడిన బిల్లును తీసుకువస్తే ఇతరుల కోసం కూడా ఇలా చేయాల్సి వస్తుందని ప్రభుత్వం బదులిచ్చిందని అన్నారు. ఇది ఏమాత్రం అర్ధం లేని వాదన అన్నారు. ప్రజల్లో ఇలాంటి విషయాలపై అవగాహన పెంచే ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలోనే మనం మరో వైద్యురాలిని కోల్పోవడం తనను బాధించిందని శశి థరూర్ విచారం వ్యక్తం చేశారు.
Read More :
KTR | ఉద్యోగులకు 1న జీతం పచ్చి అబద్ధం.. వసీం ఆత్మహత్యకు కారణమెవరు?: కేటీఆర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

