న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద కారు పేలుడు(Red Fort Blast) దాడి కోసం అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్ధాలు వాడిన విషయం తెలిసిందే. అయితే ఆ పేలుడు ఎంత శక్తివంతంగా ఉందంటే, ఘటన జరిగిన ప్రదేశానికి సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న ఓ షాపు పైకప్పుపై ఓ వ్యక్తికి చెందిన తెగిన చేయి పడి ఉన్నది. బ్లాస్ సైట్‌కు సుమారు వెయ్యి ఫీట్ల దూరంలో తెగిన చేయి పడి ఉందంటే, ఆ పేలుడు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. షాపు రూఫ్‌పై ఉన్న చేయికి చెందిన 12 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రెడ్ ఫోర్ట్ కారిడార్‌కు ఎదురుగా ఉన్న లజ్‌పత్ రాయ్ మార్కెట్లోని ఓ షాపుపై ఆ తెగి పడిన చేతిని గుర్తించారు. మోచేయి వరకు ఆ చేయి తెగి ఉన్నట్లు తెలుస్తున్నది.
కారు బాంబు పేలుడు కోసం హైగ్రేడ్ ఎక్స్‌ప్లోజివ్స్ వాడినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీ బ్లాస్ట్ సైట్ నుంచి సేకరించిన శ్యాంపిళ్ల ఆధారంగా ఆ అనుమానం వ్యక్తం చేశారు. అమోనియం నైట్రేట్ కన్నా అత్యంత శక్తివంతమైన పేలుదు పదార్ధాలను వాడినట్లు భావిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి 40 శ్యాంపిళ్లు సేకరించారు. వీటిల్లో రెండు కాట్రిడ్జ్‌లు, లైవ్ అమ్యూనిషన్, ఎక్స్‌ప్లోజివ్స్ ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం అమోనియం నైట్రేట్ వాడినట్లు ఓ శ్యాంపిల్ పరీక్ష ద్వారా నిర్ధారణకు వచ్చారు. అయితే రెండో పేలుడు శ్యాంపిల్ మాత్రం అమోనియం నైట్రేట్ కన్నా శక్తివంతంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ తర్వాత దానికి సంబంధించిన రసాయనిక పదార్ధాలను చెప్పనున్నారు.
Shocking: A severed arm was found on a shop roof 300m from the Lajpat Rai Market blast near Red Fort, revealing the explosion’s extreme force.
— Maratha Sardar (@Maratha__Sardar) November 13, 2025