Jharkhand assembly polls: జేఎంఎం పార్టీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు
Jharkhand assembly polls: జార్ఖండ్‌లో సీనియర్ బీజేపీ నేతలు.. జేఎంఎం పార్టీలో చేరారు. దీంట్లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తమ పార్టీలో చేరిన నేతలకు వెల్కమ్ పలికారు సీఎం హేమంత్ సోరెన్.
రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల(Jharkhand assembly polls) ప్రచారం జోరు అందుకున్నది. ఈ నేపథ్యంలో అనేక మంది బీజేపీ నేతలు.. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలో చేరారు. దీంట్లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు లూయిస్ మారండి, కునాల్ సారంగి, లక్ష్మణ్ తండు ఉన్నారు. మూడు సార్లు బీజేపీ టికెట్‌పై గెలిచిన కేదార్ హజ్రా కూడా ఇటీవల జేఎంఎం పార్టీలో చేరారు. బీజేపీ నుంచి 2014లో లూయిస్ మరాండి.. 5వేల ఓట్ల తేడాతో దుమ్కాలో సీఎం హేమంత్ సోరెన్‌పై విజయం సాధించారు. ఇప్పుడు లూయిస్ మరాండి జేఎంఎంలో చేరారు. మాజీ బీజేపీ నేతలకు వెల్కమ్ చెబుతూ సీఎం హేమంత్ సోరెన్ తన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అయితే దుమ్కా స్థానం నుంచి 2019లో హేమంత్ సోరెన్ 13వేల ఓట్ల తేడాతో లూయిస్ మరాండిపై గెలుపొందారు. అదే స్థానంలో జరిగిన బైపోల్స్‌లో బసంత్ సోరెన్ చేతిలో లూయిస్ ఓడిపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

