Stray Dogs | దారుణం.. ఏడు నెలల బాలుడిని కరిచి చంపిన వీధి కుక్కలు..!
Stray Dogs | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. ఏడు నెలల చిన్నారిని వీధి కుక్కలు అత్యంత కిరాతకంగా కొరికి చంపాయి. భోపాల్ నగరంలోని అయోధ్య నగర్ ఏరియాలో బుధవారం ఈ ఘటన జరిగింది. అదే రోజు కుటుంబసభ్యులు చిన్నారిని ఖననం చేశారు. కానీ, వీధి కుక్కలు బాలుడిపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భోపాల్ పోలీసులు, అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించారు.
Stray Dogs: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. ఏడు నెలల చిన్నారిని వీధి కుక్కలు అత్యంత కిరాతకంగా కొరికి చంపాయి. భోపాల్ నగరంలోని అయోధ్య నగర్ ఏరియాలో బుధవారం ఈ ఘటన జరిగింది. అదే రోజు కుటుంబసభ్యులు చిన్నారిని ఖననం చేశారు. కానీ, వీధి కుక్కలు బాలుడిపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భోపాల్ పోలీసులు, అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించారు.
వివరాల్లోకి వెళ్తే.. గుణ జిల్లాకు చెందిన కుటుంబం బతుకుదెరువు కోసం భోపాల్‌లోని అయోధ్యనగర్‌కు వచ్చి నివాసం ఉంటోంది. భర్త, భార్య ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం తల్లి తన ఏడు నెలల కొడుకును నేలపై పడుకోబట్టి పనిలో నిమగ్నమైంది. అటుగా వచ్చిన వీధి కుక్కలు బాలుడిని ఎత్తుకెళ్లి కరిచి చంపాయి. ఒక చేతిని శరీరం నుంచి వేరుచేశాయి.
స్థానికులు గమనించి కుక్కలను తరిమేశారు. కానీ, అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం కుటుంబసభ్యులు బాలుడిని సమాధి చేశారు. అయితే వీధి కుక్కల దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో భోపాల్ అధికారులు, పోలీసులు ఘటనపై దృష్టిపెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టానికి పంపించారు. మృతుడి పేరెంట్స్‌కు భోపాల్ నగరపాలక శాఖ నుంచి రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు. త్వరలో మరో రూ.50 వేలు అందించనున్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

