Home
National
Seven Killed In Gelatin Stick Explosion During Roadwork In Andhra Pradeshs Alluri District
జిలెటిన్ స్టిక్స్ పేలి ఏడుగురి దుర్మరణం
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.
- ఏపీలోని అల్లూరి జిల్లా రోడ్డు పనుల్లో ఘటన
పినకోట: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అనంతగిరి మండలం పినకోట వద్ద రోడ్డు పనుల కోసం బ్లాస్టింగ్(పేలుడు) చేపడుతుండగా ఇది చోటు చేసుకొంది. పేలుడు పనుల కోసం కాంట్రాక్టర్ జిలెటిన్ స్టిక్స్‌ను తెప్పించి లారీలో ఉంచారు.
ఆ లారీలో డీజిల్ నింపుతుండగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు అంటుకొని జిలెటిన్ స్టిక్స్ పేలాయి. దీంతో అక్కడున్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. మృతుల్లో అయిదుగురు కార్మికులు, ఒక డ్రైవర్, అటుగా వెళ్తున్న టీచర్ ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

