Covovax | భారత్ నుంచి మరో కోవిడ్ వ్యాక్సిన్.. WHO గ్రీన్ సిగ్నల్
భారత్ నుంచి మరో కోవిడ్ వ్యాక్సిన్ | వ్యాక్సిన్ సమర్థత, సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే సీరమ్ ఇన్స్టిట్యూట్
Covovax | పూణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోవోవాక్స్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆమోదం తెలిపింది. కాకపోతే.. ఆ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. వ్యాక్సిన్ సమర్థత, సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే సీరమ్ ఇన్స్టిట్యూట్.. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఆ వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా ప్రజలకు అందిస్తున్నారు.

కోవోవాక్స్‌ను నోవావాక్స్ సంస్థతో కలిసి సీరమ్ డెవలప్ చేసింది. ఈ వ్యాక్సిన్‌ను కూడా రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. కోవోవాక్స్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలపడంతో సీరమ్ సంస్థ సీఈవో సంతోషం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ట్వీట్ చేశారు.
This is yet another milestone in our fight against COVID-19, Covovax is now W.H.O. approved for emergency use, showing excellent safety and efficacy. Thank you all for a great collaboration, @Novavax @WHO @GaviSeth @Gavi @gatesfoundation https://t.co/7C8RVZa3Y4
— Adar Poonawalla (@adarpoonawalla) December 17, 2021
కరోనా ఎన్నిసార్లు మ్యుటేషన్ చెందినా.. ఎన్ని కొత్త వేరియంట్లు వచ్చినా.. వాటికి అడ్డుకట్ట వేయడానికి వ్యాక్సిన్లే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రాణాపాయ స్థితి నుంచి ప్రజలను కాపాడేది వ్యాక్సిన్లే. అందుకే కోవోవాక్స్‌ను కూడా రివ్యూ చేశాం. దాని క్వాలిటీ, భద్రత, సమర్థత.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక.. భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చాక.. మేము ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపాం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ సార్స్ కోవ్2(SARS-COV-2) వేరియంట్‌పై సమర్థంగా పనిచేస్తుందని.. కాకపోతే అత్యవసర సమయంలోనే ఈ వ్యాక్సిన్‌ను ప్రజలకు వేయాలని సంస్థ సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

