MK Stalin | తొలిరోజే సెంగోల్ వంగిపోయింది.. రెజ్లర్లపై పోలీసుల తీరును ఖండించిన సీఎం స్టాలిన్
MK Stalin | పార్లమెంట్ ప్రారంభోత్సవం తొలిరోజే ప్రతిష్ఠించిన చారిత్రాత్మక సెంగోల్ (Sengol) వంగిపోయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) వ్యాఖ్యానించారు.
MK Stalin | పార్లమెంట్ ప్రారంభోత్సవం తొలిరోజే ప్రతిష్ఠించిన చారిత్రాత్మక సెంగోల్ (Sengol) వంగిపోయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) వ్యాఖ్యానించారు. సరిగ్గా ప్రారంభోత్సవం రోజే ధర్మానికి ప్రతీక, మన చారిత్రక సంప్రదాయం అపహాస్య పాలైందన్నారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రెజ్లర్ల (Wrestlers)ను పోలీసులు (Police) అదుపులోకి తీసుకోవడంపై స్టాలిన్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల తీరును సీఎం స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. గత కొన్ని రోజులుగా న్యాయం కోసం పోరాడుతున్న రెజ్లర్లకు బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ట్విట్టర్ ద్వారా విమర్శించారు. ‘శాంతియుతంగా పార్లమెంట్ వెలుపల నిరసన తెలిపేందుకు వచ్చిన రెజ్లర్లను ఈడ్చుకెళ్లి నిర్బంధించడం అనేది ఖండించదగ్గ విషయం. ఈ ఘటనతో ధర్మానికి ప్రతీక అయిన సెంగోల్ మొదటిరోజే వంగిపోయినట్లు అర్థమవుతోంది. రాష్ట్రపతిని పక్కకు తప్పించి, ప్రతిపక్షాల బహిష్కరణల మధ్య కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజున ఇలాంటి దారుణం జరగడం న్యాయమేనా?’ అని స్టాలిన్ ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ (WFI Chief), బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh ) కు వ్యతిరేకంగా టాప్ రెజ్లర్లు నెల రోజులుగా ఢిల్లీ (Delhi) లోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి ఆందోళనకు బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో.. రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళ్తుండగా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించి, రెజ్లర్లపైనే కేసులు నమోదుచేశారు.
பாஜக நாடாளுமன்ற உறுப்பினர் ஒருவர் மீது மல்யுத்த வீராங்கனைகள் பாலியல் புகார் சொல்லிப் பல மாதங்கள் ஆகிவிட்டன. அவர் மீது இதுவரை அக்கட்சியின் தலைமை எந்த நடவடிக்கையும் எடுக்கவில்லை. மல்யுத்த வீராங்கனைகள் தொடர்ந்து தலைநகரில் போராடி வருகிறார்கள். இந்திய நாடாளுமன்றத்தின் புதிய கட்டடத்… https://t.co/9azP1YuSKB
— M.K.Stalin (@mkstalin) May 28, 2023
Also Read..
KTR | రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా..? ప్రశ్నించిన మంత్రి కేటీఆర్
Bro Movie | బ్రో మూవీ కొత్త పోస్టర్ రిలీజ్.. క్లాస్సీ లుక్లో మామా అల్లుళ్లు అదిరిపోయారుగా..!
Yoga | నిత్య ఆరోగ్యానికి యోగాస్త్రం.. సాధనపై మక్కువ పెంచుకుంటున్న యువత, ఉద్యోగులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

