Manipur Rally | మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలంటూ.. వేలాది మంది ర్యాలీ
Manipur Rally | మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని ఆ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేశారు. రాజధాని ఇంఫాల్ లోయలో భారీ ర్యాలీ నిర్వహించారు. కుకీయేతర తెగలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. స్థానిక ప్రజలను రక్షించాలని నినాదాలు చేశారు.
ఇంఫాల్: మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని ఆ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేశారు. రాజధాని ఇంఫాల్ లోయలో భారీ ర్యాలీ నిర్వహించారు. (Manipur Rally) కుకీయేతర తెగలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. స్థానిక ప్రజలను రక్షించాలని నినాదాలు చేశారు. మణిపూర్ సమగ్రత కోసం ఏర్పడిన సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇంఫాల్‌లో ర్యాలీ జరిగింది. కుకీల మినహా మిగతా తెగల ప్రజలు, మీరా పైబీ సంస్థకు చెందిన వృద్ధ మహిళలు ఇందులో పాల్గొన్నారు. మణిపూర్ ప్రాదేశిక సమగ్రత, స్థానిక ప్రజలను కాపాడాలంటూ నినాదాలు చేశారు. పలు ఫ్లకార్డులను ప్రదర్శించారు.
కాగా, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) కసరత్తును చేపట్టాలని, కుకీ తిరుగుబాటు గ్రూపులతో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని, లోయ, కొండ ప్రాంతాల్లో సమానంగా కూంబింగ్ నిర్వహించాలని, మణిపూర్ ప్రాదేశిక, పరిపాలనా సమగ్రతను కాపాడాలని, ప్రజలు ఇంటికి తిరిగి రాకుండా నిరోధించే బఫర్ జోన్లను తొలగించాలని ఇంఫాల్ ప్రజలు డిమాండ్ చేశారు.
మరోవైపు తాము ఏ వర్గానికి వ్యతిరేకం కాదని సమన్వయ కమిటీ నేత జీతేంద్ర నింగోంబ తెలిపారు.
కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై తాము ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. మణిపూర్ ఆదివాసీల నిర్మూలనకు సంబంధించిన అన్ని విధి విధానాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మణిపూర్ విభజనకు తాము వ్యతిరేకమన్నారు. కేవలం శాంతిని మాత్రమే తాము కోరుతున్నామని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

