చండీగఢ్: వివాహిత మహిళకు ఇద్దరు వ్యక్తులతో సంబంధం ఉన్నది. ఈ నేపథ్యంలో మరో వ్యక్తితో ఆమె కలిసి ఉండటం చూసి ప్రియుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. కత్తితో పొడిచి ఆమెను హత్య చేశాడు. (Woman Stabbed To Death By Lover) మహిళ భర్త ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల నీలమ్ తన భర్తతో కలిసి బినోలా గ్రామంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నది. అదే ప్రాంతంలో ఆమె పని చేస్తున్నది. ఈ నేపథ్యంలో వినోద్, సుధీర్‌తో ఏర్పడిన పరిచయం వారిద్దరితో వివాహేతర సంబంధానికి దారి తీసింది.
కాగా, ఏప్రిల్ 7న సాయంత్రం వేళ నీలమ్ ఇంటికి ప్రియుడు వినోద్ వచ్చాడు. మరో ప్రియుడు సుధీర్‌తో కలిసి ఆమె ఉండటం చూశాడు. దీంతో తనను దూరంగా ఉంచడంపై ఆగ్రహించాడు. నీలమ్‌తో గొడవ పడ్డాడు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని వినోద్‌కు ఆమె చెప్పింది. అయితే వంటింట్లో ఉన్న కత్తితో నీలమ్ కడుపులో పొడిచి పారిపోయాడు.
మరోవైపు తీవ్రంగా గాయపడిన నీలమ్‌ను రేవారిలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీంతో నీలమ్ భర్త ఫిర్యాదుతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా కంద్వాచక్ గ్రామానికి చెందిన నిందితుడు వినోద్‌ను అరెస్ట్ చేశారు. తనను పట్టించుకోకపోవడంతో నీలమ్‌ను హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.