ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసు దేశ రాజధానిలో కలకలం రేపింది. దాడికి నిరసనగా బీజేపీ సహా మహిళా సంఘాలు నిరసనలు చేపట్టాయి.
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసు దేశ రాజధానిలో కలకలం రేపింది. దాడికి నిరసనగా బీజేపీ సహా మహిళా సంఘాలు నిరసనలు చేపట్టాయి. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. సొంత పార్టీ ఎంపీపై ఆప్ నేతలు దాడి చేయడంతో విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
స్వాతి మలివాల్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఆమెకు శుక్రవారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ముఖంపై సహా అంతర్గతంగా గాయాలయ్యాయని వెల్లడైంది. ఢిల్లీ సీఎం పీఏ బిభవ్ కుమార్ కేజ్రీవాల్ నివాసంలో తనను తిట్టి, ఛాతీపై, పొట్ట భాగంలో తన్నాడని ఆమె ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
కేజ్రీవాల్ బెయిల్‌పై బయటకు రావడంతో కంగుతిన్న కాషాయ పార్టీ స్వాతి మలివాల్‌ను పావుగా చేసుకుని కుట్రకు తెరలేపిందని ఆప్ మంత్రి అతిషి ఆరోపించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ లేకపోవడంతో ఆయన పీఏపై ఆరోపణలకు తెగబడ్డారని అన్నారు. వీడియోలో స్వాతి మలివాల్‌కు ఎలాంటి గాయాలు అయినట్టు కనిపించలేదని అతిషి చెప్పుకొచ్చారు.
Read More :
Arvind Kejriwal | నిందితుల జాబితాలో తొలిసారి పార్టీ పేరు.. మద్యం పాలసీ కేసులో ఆప్‌ను చేర్చిన ఈడీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

