Corona Effect | ఆర్థిక రాజధానిలో ఈనెల 19 వరకు 144 సెక్షన్
144 సెక్షన్ | కరోనా నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మహమ్మారి వ్యాప్తిని నిలువరించడానికి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈనెల 19 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నది.

ముంబై: కరోనా నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మహమ్మారి వ్యాప్తిని నిలువరించడానికి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈనెల 19 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నది. మహానగరంలో బహిరంగ ఉత్సవాలు, ఊరేగింపులపై నిషేధం విధించింది. వీధుల్లో ఐదుగురికంటే గుమికూడటానికి వీల్లేదని పోలీసులు ప్రకటించారు. భక్తులు కూడా గణేశుని మంటపాలను దర్శించకూడదని స్పష్టం చేశారు. గణనాథుడిని ఆన్లైన్, ఎలక్ట్రానిక్ మీడియాలోనే దర్శించుకోవాలని సూచించారు. ఈమేరకు ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాలు జారీచేశారు.
ఇక ఉత్తరప్రదేశ్‌లో కూడా బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుపై ప్రభుత్వం నిషేధం విధించింది. అదేవిధంగా తమిళనాడులో పండుగలు, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉన్నది. ఢిల్లీలో గణేశ్ ఉత్సవాలను బహిరంగంగా నిర్వహించొద్దని ఆదేశాలు జారీచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

