Breaking News | బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటిసులు.. మూడు వారాల్లోగో వివరణ ఇవ్వాలని ఆదేశం
BBC documentary Row | బీబీసీ డాక్యుమెంటరీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. బీబీసీ డాక్యుమెంటరీని సెన్సారింగ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
న్యూఢిల్లీ: బీబీసీ డాక్యుమెంటరీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. బీబీసీ డాక్యుమెంటరీని సెన్సారింగ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌ను ఇవాళ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్రానికి నోటీసులు ఇష్యూ చేసింది.
అంతేగాక, ఆ నోటీసులకు మూడు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏప్రిల్‌లో చేపట్టనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కాగా, గుజరాత్‌లోని గోద్రాలో 2002లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీబీసీ తాజాగా ఒక డాక్యుమెంటరీని రూపొందించింది.
అయితే, ఆ డాక్యుమెంటరీలో అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీకి, గుజరాత్ హోంమంత్రిగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సంబంధించి కొన్ని అభ్యంతరకర విషయాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం డాక్యుమెంటరీని సెన్సార్ చేయకుండా అడ్డుకోవాలంటూ బీబీసీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దాంతో కోర్టు కేంద్రానికి తాజా ఆదేశాలు జారీచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

