Saudi prince | కారు ప్రమాదంలో తీవ్ర గాయాలు.. 20 ఏళ్లుగా కోమాలోనే యువరాజు..!
Saudi prince | సౌదీ రాజకుటుంబంలో పుట్టాడు. వేల కోట్ల రూపాయల సంపద ఉంది. కానీ అతను వాటిని అనుభవించలేకపోతున్నాడు. ఎందుకంటే ఓ కారు ప్రమాదంలో గాయపడి 20 ఏళ్లుగా కోమాలోనే ఉన్నాడు. ఏదైనా అద్భుతం జరిగి తమ కుమారుడు మళ్లీ ఈ ప్రపంచాన్ని చూస్తాడనే ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.
Saudi prince : అతను సౌదీ రాజకుటుంబంలో పుట్టాడు. వేల కోట్ల రూపాయల సంపద ఉంది. కానీ అతను వాటిని అనుభవించలేకపోతున్నాడు. ఎందుకంటే ఓ కారు ప్రమాదంలో గాయపడి 20 ఏళ్లుగా కోమాలోనే ఉన్నాడు. ఏదైనా అద్భుతం జరిగి తమ కుమారుడు మళ్లీ ఈ ప్రపంచాన్ని చూస్తాడనే ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఇలా 20 ఏళ్లు గడిచినా అతడి ఆరోగ్యంలో ఏ మాత్రం పురోగతి లేదు. ఇదీ సౌదీ యువరాజు అల్-వహీద్ బిన్ ఖలీద్ బిన్ విషాద గాథ.
నాడు 16 ఏళ్ల వయసులో కోమాలోకి వెళ్లిన యువరాజు అల్ వహీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ ఇప్పుడు 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నెల 18న అతడికి 35 ఏళ్లు పూర్తయ్యి 36 ఏళ్లు వచ్చాయి. బిలియనీర్, యువరాజు అయిన ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కుమారుడే అల్-వహీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్. అతడు బ్రిటన్‌లోని మిలిటరీ కాలేజీలో చదువుతుండేవాడు. 2005లో జరిగిన ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
అప్పటినుంచి కోమాలో ఉన్న ఆయనకు రియాద్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ మెడికల్ సిటీ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. ట్యూబ్ ద్వారానే ఆహారం అందిస్తున్నారు. గడిచినా 20 ఏళ్లుగా కోమాలోనే ఉంటున్న యువరాజును ‘స్లీపింగ్ ప్రిన్స్’గా పిలుస్తున్నారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న యువరాజు కోలుకునే అవకాశం లేదని భావించిన వైద్యులు, వెంటిలేటర్‌ను తొలగించాలని 2015లో సిఫారసు చేశారు.
అయితే అతడి తండ్రి అందుకు నిరాకరించారు. ఎప్పుడైనా ఏదైనా అద్భుతం జరిగి తన కుమారుడు కోలుకోవచ్చనే ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రమాదంలో తన కుమారుడు చనిపోవాలని భగవంతుడు కోరుకుంటే.. ఇప్పుడు అతడు సమాధిలో ఉండేవాడని, కానీ అలా జరగలేదని చెప్పారు. అల్-వహీద్ తల్లి ప్రిన్సెస్ రీమా కూడా తనయుడు కోలుకుంటాడనే ఆశతో ఎదురుచూస్తున్నారు.
అల్-వహీద్ బిన్ 2019లో ఓసారి కోలుకుంటున్నట్లు కనిపించింది. చేతివేళ్లు కదిలించడం, తలను అటూఇటూ తిప్పడం లాంటివి చేయడంతో యువరాజు కుటుంబంలో ఆశలు చిగురించాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో ఇటీవల 36 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో యువరాజు ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో ఆయన మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

