Sakshi Malik | డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలి : సాక్షి మాలిక్ డిమాండ్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ (Sakshi Malik) డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ (Sakshi Malik) బుధవారం డిమాండ్ చేశారు. రెజ్లర్లను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చర్చలకు ఆహ్వానించిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా తమ నిరసనను విరమించడం లేదని, ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనతో ముందుకొస్తుందో పరిశీలించేందుకు వేచిచూస్తామని సాక్షి మాలిక్ స్పష్టం చేశారు.
ఖాప్ పంచాయత్ నేతలతో ప్రభుత్వ సంప్రదింపుల్లో ముందుకొచ్చిన ప్రతిపాదనపైనే తాము చర్చిస్తామని, ఇతర ప్రతిపాదనలను తాము ఆమోదించబోమని తేల్చిచెప్పారు. ప్రభుత్వంతో బహిరంగ చర్చల కోసం తాము వేచిచూస్తున్నామని మహిళా రెజ్లర్లు పేర్కొన్నారు. ప్రభుత్వంతో చర్చల సందర్భంగా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. హోంమంత్రి అమిత్ షాతో రెజ్లర్ల సమావేశం అసంపూర్తిగా ముగియడంతో అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్ల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు రెజ్లర్ల సమస్యలపై సంప్రదింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.
తాను మరోసారి రెజ్లర్లను చర్చలకు ఆహ్వానిస్తున్నానని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. ఇక క్రీడా మంత్రి ఠాకూర్‌తో రెజ్లర్ల సమావేశంపై స్పందించేందుకు బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ నిరాకరించారు. కాగా కేంద్ర మంత్రి రెజ్లర్లను చర్చలకు ఆహ్వానించడంపై ద్రోణాచార్య అవార్డు గ్రహీత, రెజ్లింగ్ కోచ్ మహవీర్ సింగ్ పొఘట్ స్పందించారు. నిద్రలో జోగుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవడం సంతోషకరమని ఆయన వ్యాఖ్యానించారు.
Read More
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రెండు పిచ్‌లు రెఢీ.. ఎందుకంటే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

