ఆయన మాటలు సిగ్గుచేటు.. బర్తరఫ్ చేయండి: స్మృతి ఇరానీ
రేప్‌ను ఎంజాయ్ చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్ కుమార్ పై కేంద్ర మహిళా శిశు సంక్షేమ

రేప్‌ను ఎంజాయ్ చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్ కుమార్ పై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా మండిపడ్డారు. ఇలా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేసిన చోటే, మహిళల విషయంలో కించపరిచే మాటలు మాట్లాడటం నిజంగా సిగ్గుచేటని ఆమె ఆక్షేపించారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే వెంటనే ఆయన్ను బర్తరఫ్ చేయాలని స్మృతి ఇరానీ సవాల్ విసిరారు.
దుమ్ము దుమారం రేపుతున్న వ్యాఖ్యలు
లైంగికదాడి అనివార్యమైనప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలంటూ రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. శాసనసభలో ఈ వ్యాఖ్యలను ఖండించకుండా స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి పగలబడి నవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతు సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని కోరుతూ బుధవారం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను డిమాండ్ చేస్తున్న సమయంలో స్పీకర్‌ను ఉద్దేశించి రమేశ్‌కుమార్ పైవ్యాఖ్య చేశారు. ‘ఒక సామెత ఉంది. లైంగికదాడి అనివార్యమైనప్పుడు, పడుకొని ఎంజాయ్ చేయాలి. మీరు ఉన్న స్థితి కూడా సరిగ్గా అదే’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీలోని ఏ ఒక్క సభ్యుడు కూడా అభ్యంతరం చెప్పలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

