బలిపశువును చేశారన్న సచిన్ వాజే.. ఏప్రిల్ 3 వరకు ఎన్ఐఏ కస్టడీ

ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన బాంబులతో కూడిన వాహనం నిలిపి ఉన్న కేసులో ఆరోపణలపై సస్పెండ్ అయిన పోలీస్ అధికారి సచిన్ వాజే, ఎన్ఐఏ కస్టడీని ఏప్రిల్ 3 వరకు కోర్టు పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో ఎన్ఐఏ అధికారులు వాజేను గురువారం ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తనను బలిపశువును చేశారని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కోర్టుకు తెలిపారు. తాను ఈ కేసులో ఒకటిన్నర రోజులు దర్యాప్తు అధికారిగా ఉన్నానని, విధిపరంగా చేయాల్సింది చేశానని చెప్పారు. అయితే ఒక్కసారిగా ఏదో మార్పు జరిగిందని, దీంతో తానే స్వయంగా ఎన్ఐఏ కార్యాలయానికి వెళ్లి లొంగిపోయినట్లు వెల్లడించారు. తాను నేరానికి పాల్పడినట్లు ఎక్కడా ఒప్పుకోలేదని కోర్టుకు తెలిపారు.
కాగా, ఎన్ఐఏ తరుఫున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కోర్టులో వాదించారు. ఈ నేరంలో ఒక పోలీస్ పాత్ర ఉన్నట్లు తెలుసుకున్న ప్రతి ఒక్కరు షాక్ అయ్యారని అన్నారు. దర్యాప్తులో భాగంగా వాజే ఇంట్లో అధికారులు సోదా చేయగా 62 తుపాకీ గుండ్లు లభించాయన్నారు. ఇవి ఆయన వద్ద ఎందుకు ఉన్నాయి అన్నది దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.
పోలీస్ శాఖ వాజేకు 30 బులెట్లు ఇచ్చిందని, వీటిలో కేవలం ఐదు మాత్రమే లభించగా మిగతావి మాయమయ్యాయని అనిల్ సింగ్ చెప్పారు. ఈ నేపథ్యంలో వాజేను ఎన్ఐఏ అధికారులు మరింతగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. వ్యాపారి మన్సుఖ్ హిరెన్ హత్య కేసు నిందితులతో పాటు ఆయనను ప్రశ్నించాల్సి ఉన్నదని కోర్టుకు తెలిపారు. దీంతో వాజే ఎన్ఐఏ కస్టడీని ఏప్రిల్ 3 వరకు కోర్టు పొడిగించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

