శబరిమలను దర్శించే భక్తుల సంఖ్య పది వేలకు పెంపు

తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల ఆలయాన్ని రోజువారీ దర్శించే భక్తుల సంఖ్యను 5 వేల నుంచి పది వేలకు పెంచారు. కేరళ ప్రభుత్వం ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భక్తులు కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించింది. శబరిమల ఆలయాన్ని మాస పూజల కోసం శుక్రవారం తెరిచారు. ప్రధాన పూజారి వీకే జయరాజ్ పొట్టి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తాంత్రి కందారు మహేష్ మోహనారు సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో ఆలయాన్ని తెరిచారు.
కార్కిదకం మలయాళ మాసం నేపథ్యంలో అయ్యప్ప స్వామికి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి ఈ నెల 21 వరకు ఐదు రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. కరోనా నేపథ్యంలో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు రోజుకు 5000 వేల మంది భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తామని చెప్పింది. ఆన్లైన్ ద్వారా స్లాట్లు నమోదు చేసుకోవాలని పేర్కొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 48 గంటలు ముందుగా చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ లేదా కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించిన భక్తులను మాత్రమే ఆలయంలోకి ప్రవేశానికి అనుమతిస్తామని బోర్డు వెల్లడించింది.
అయితే శబరిమలను సందర్శించే రోజువారీ భక్తుల సంఖ్యను 5000 నుంచి పది వేలకు కేరళ ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మార్గదర్శకాలను పక్కగా పాటించాలని పేర్కొంది. మరోవైపు కరోనా పరీక్షలకు నీలక్కల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ గడువు చెల్లిన వారికి కరోనా పరీక్ష చేస్తారు. పాజిటివ్ వచ్చిన వారిని పెరునాడులోని ఐసొలేషన్ కేంద్రానికి తరలిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
MLA Madhavaram krishna rao | హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి.. సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
కాచిరాజుగూడెంలో కోడి పందాలపై పోలీసుల రైడ్
AP Rains | బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఏపీలో నాలుగురోజులు వర్షాలు..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

