Sabarimala Revenue: శబరిమల ఆదాయం 241 కోట్లు.. గత ఏడాదితో పోలిస్తే 18 కోట్లు అధికం
Sabarimala Revenue: రికార్డు స్థాయిలో ఈసారి శబరిమల అయ్యప్ప స్వామికి ఆదాయం వచ్చింది. మండల పూజ దినాల్లో రూ.241 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు తెలిపారు. గత ఏడాది 222 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఈసారి ఆదాయం 18 కోట్లు అధికంగా వచ్చింది. ఇంకా నాణాలు, పార్కింగ్ ఫీజు లెక్కించాల్సి ఉంది.
తిరువనంతపురం: మండల పూజ వేళ శబరిమల అయప్ప స్వామి ఆలయానికి 241.71 కోట్ల ఆదాయం(Sabarimala Revenue) వచ్చింది. 41 రోజుల్లో ఆ ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. గత ఏడాది సీజన్తో పోలిస్తే ఈసారి 18.72 కోట్లు అధికంగా వచ్చినట్లు ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. గత ఏడాది 222.98 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. 39 రోజుల్లోనే ఆలయ ఆదాయం 200 కోట్లు దాటినట్లు ఆయన వెల్లడించారు. వేలం ద్వారా 37.40 కోట్లు వచ్చినట్లు ఓ మీడియా సమావేశంలో ప్రశాంత్ తెలిపారు. కానుకల రూపంలో వచ్చిన నాణాలను, నీలక్కల్ వద్ద పార్కింగ్ ఫీజులను లెక్కిస్తే ఆ మొత్తం ఆదాయం మరింత పెరుగుతుందని ఆయన తెలిపారు.
నగదు కానుకల రూపంలో 63.89 కోట్లు, అరవన ప్రసాదం ద్వారా 96.32 కోట్లు, అప్పం స్వీటు ద్వారా 12.38 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రశాతం చెప్పారు. బుధవారం కూడా అధిక సంఖ్యలో అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లుత తెలిపారు. బుధవారం రాత్రి ఆలయాన్ని మూసివేశారు. మూడు రోజుల తర్వాత డిసెంబర్ 30వ తేదీన తిరిగి ఆలయాన్ని తెరవనున్నారు. జనవరి 15వ తేదీన జరిగే మకరవిలక్కు పండుగ వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

