S Jai Shankar | ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని సహించొద్దు : ఎస్ జైశంకర్
S Jai Shankar | భారత ప్రజలను ఉగ్రవాదం (Terrorism) నుంచి రక్షించుకునే హక్కు తమ దేశానికి ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి (Foreign minister) ఎస్ జైశంకర్ (S Jai Shankar) అన్నారు. రష్యా (Russia) లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ (SCO summit) లో ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడారు.
S Jai Shankar | భారత ప్రజలను ఉగ్రవాదం (Terrorism) నుంచి రక్షించుకునే హక్కు తమ దేశానికి ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి (Foreign minister) ఎస్ జైశంకర్ (S Jai Shankar) అన్నారు. రష్యా (Russia) లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ (SCO summit) లో ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని సహించకూడదని వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించే ధోరణి ఉండకూడదని జైశంకర్ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అనేది ఉమ్మడి ప్రాధాన్యంగా ఉండాలని సూచించారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా జైశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎస్సీవో సదస్సులో పాల్గొన్నారు. అంతకుముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లవ్రోవ్తో ఆయన సమావేశమయ్యారు. ఇరువురు రెండు దేశాల ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

