Russia on Gas | ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా దూకుడు పెంచింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన రెండు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలకు గ్యాస్ సరఫరా నిలిపివేసింది. పోలండ్, బల్గేరియాలకు గ్యాస్ పంపిణీ నిలిపివేస్తున్నట్లు రష్యా అధికార గ్యాస్ సరఫరా సంస్థ గాజ్ప్రొమ్ బుధవారం ప్రకటించింది. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్ విధానానికి బదులు నగదు రూపంలో అంటే రూబుల్స్ రూపంలో చెల్లింపులు జరుపడానికి పోలండ్, బల్గేరియా నిరాకరించాయి.
అమెరికా, దాని మిత్రదేశాలు ఆంక్షలు విధించడంతో ఇంటర్నేషనల్ పేమెంట్స్ వ్యవస్థ స్విఫ్ట్ నుంచి రష్యా దూరమైంది. దీనికి బదులు రూబల్స్లో పే చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి చర్చలే పరిష్కార మార్గం అని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జై శంకర్ సూచించారు. యుద్ధాన్ని నిలువరించి చర్చల కోసం ముందడుగు వేయాలని రష్యాను కోరుతున్నామన్నారు. ఈ వివాద పరిష్కారానికి భారత్ ముందు ఉన్న అత్యుత్తమ మార్గం అని అన్నారు.