Kapil Sibal | విపక్ష ఇండియా కూటమి భేటీలో కపిల్ సిబల్ ప్రత్యక్షం
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరుగుతున్న విపక్ష భారత జాతీయ సమ్మిళిత అభివృద్ధి కూటమి (ఇండియా) సమావేశంలో రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) ప్రత్యక్షం కావడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది.
ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరుగుతున్న విపక్ష భారత జాతీయ సమ్మిళిత అభివృద్ధి కూటమి (ఇండియా) సమావేశంలో రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) ప్రత్యక్షం కావడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ సమావేశానికి సిబల్‌ను అధికారికంగా ఆహ్వానించకపోయినప్పటికీ ఆయన హాజరు కావడం పలువురిని విస్మయపరిచింది.
ఇండియా భేటీలో అనూహ్యంగా కపిల్ సిబల్ కనిపించడంపై ఇండియా ముంబై భేటీలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫిర్యాదు చేశారు. కాగా విపక్ష సమావేశానికి ఎవరు హాజరైనా తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కపిల్ సిబల్ గత ఏడాది మేలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏను దీటుగా ఎదుర్కొనే క్రమంలో ఉమ్మడి అజెండా, సీట్ల సర్ధుబాటుపై స్పష్టత కోసం ఈ సమావేశంలో విపక్షాలు కసరత్తు సాగిస్తున్నాయి. ఇదే సమావేశంలో విపక్ష కూటమి ఇండియా లోగోను కూడా ఖరారు చేయనున్నారు. కూటమి కన్వీనర్ నియామకంపైనా నేతలు చర్చించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి పోరుకు సంబంధించి ఈ భేటీలో విపక్ష నేతలు కీలక నిర్ణయాలతో ముందుకు రానున్నారు. సమన్వయ కమిటీ, సహా పలు ఉప కమిటీలను నేతలు ప్రకటిస్తూ సంయుక్త ప్రకటనను జారీ చేయనున్నారు.
Read More :
Aparna P Nair | నివాసంలోనే విగతజీవిగా ప్రముఖ నటి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

