Rolls Royce Ghost | వరద నీటిలో ఆగిపోయిన ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్.. షాకవుతున్న నెటిజన్లు.. Video Viral
Rolls Royce Ghost | వరద నీటిలో ఓ ఖరీదైన కారు చిక్కుకుపోయిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. రోల్స్ రాయిస్ ఘోస్ట్ (Rolls Royce Ghost) బ్లాక్ కలర్ కారు వరద నీటిలో ఆగిపోయింది.
Rolls Royce Ghost | ఇన్ని రోజులూ తీవ్ర ఎండ కారణంగా ఉక్కపోతతో అల్లాడిపోయిన దేశరాజధాని ఢిల్లీని ఇటీవలే భారీ వర్షం కుదిపేసిన విషయం తెలిసిందే. గత నెల 28న ఢిల్లీ వ్యాప్తంగా కేవలం మూడు గంటల్లోనే రికార్డు స్థాయిలో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. పలు చోట్ల కార్లు మునిగిపోయాయి. ప్రధాన రహదారులు సైతం నదులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ క్రమంలో వరద నీటిలో ఓ ఖరీదైన కారు చిక్కుకుపోయిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. రోల్స్ రాయిస్ ఘోస్ట్ (Rolls Royce Ghost) బ్లాక్ కలర్ కారు వరద నీటిలో ఆగిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఇతర వాహనదారులు ఈ ఖరీదైన కారు వరద నీటిలో ఆగిపోవడం చూసి షాక్ అయ్యారు. ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. తన మారుతీ సుజుకీ కారులోంచి ఈ వీడియో తీసినట్లు సదరు యూజర్ పేర్కొన్నారు.
కాగా, ఇది పాత రకం రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు. ఇది భారత్‌లో 2009 – 2010లో సుమారు రూ.2.5 కోట్ల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో దీన్ని ప్రారంభించారు. అయితే ఈ మోడల్ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఇంత ఖరీదైన కారు ఇలా వరద నీటిలో చిక్కుకుపోవడం చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
Also Read..
Rahul Gandhi | లోక్‌సభలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు.. రికార్డుల నుంచి తొలగింపు
Salman Khan | రూ.25లక్షల ఒప్పందం.. ఆధునిక ఆయుధాలతో సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా స్కెచ్
Turbulence | స్పానిష్ విమానంలో భారీ కుదుపులు.. 30 మంది ప్రయాణికులకు గాయాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

