Turbulence | స్పానిష్ విమానంలో భారీ కుదుపులు.. 30 మంది ప్రయాణికులకు గాయాలు
Turbulence | ఎయిర్ యూరోపా (Air Europa)కు చెందిన ఓ విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్పెయిన్ నుంచి ఉరుగ్వేకి వెళ్తున్న విమానం మార్గం మధ్యలో భారీ కుదుపులకు (Turbulence) లోనైంది.
Turbulence | ఎయిర్ యూరోపా (Air Europa)కు చెందిన ఓ విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్పెయిన్ నుంచి ఉరుగ్వేకి వెళ్తున్న విమానం మార్గం మధ్యలో భారీ కుదుపులకు (Turbulence) లోనైంది. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు. దీంతో విమానాన్ని బ్రెజిల్ (Brazil)లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
ది న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఎయిర్ యూరోపా బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానం 325 మంది ప్రయాణికులతో సోమవారం స్పెయిన్ (Spain)లోని మాడ్రిడ్ నుంచి ఉరుగ్వే (Uruguay) రాజధాని మాంటెవీడియో (Montevideo)కు బయల్దేరింది. అయితే మార్గం మధ్యలో విమానంలో అల్లకల్లోలం నెలకొంది. తీవ్రమైన కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు వారి సీట్ల నుంచి కిందపడిపోయారు. ఓ ప్రయాణికుడు ఏకంగా ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లో ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు.
ఈ ఘటనతో విమానాన్ని ఈశాన్య బ్రెజిల్‌లోని నాటల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపినట్లు ది న్యూయార్క్ పోర్ట్ వెల్లడించింది. అక్కడ విమానం ఎలాంటి సమస్య లేకుండా సురక్షితంగా ల్యాండ్ అయినట్లు పేర్కొంది. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, ఇటీవలే లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న విమానం, దోహా నుంచి డబ్లిన్‌కు వెళ్తున్న ఖతార్ విమానంలోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ రెండు ఘటనల్లోనూ పలువురు గాయపడ్డారు.
#INCIDENTE | Al menos 30 pasajeros resultaron heridos cuando el vuelo UX045 de Air Europa, un Boeing 787-9 que viajaba de Madrid a Montevideo, encontró severas turbulencias temprano esta mañana.
Tras el incidente, el vuelo fue desviado a Natal, Brasil, donde los heridos… pic.twitter.com/ksXFTxB49d— Aviación Guayaquil (@AviacionGYE) July 1, 2024
Also Read..
KTR | మా కరువులకు.. కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం: కేటీఆర్
Donald Trump: అధ్యక్షుడికి ఆ రక్షణ ఉంటుంది.. ట్రంప్‌కు అండగా నిలిచిన సుప్రీంకోర్టు
Goods Train Derails: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఢిల్లీ-అంబాలా రూట్లో ట్రాఫిక్ అంతరాయం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

