రోడ్డు అధ్వాన్నంగా ఉంది, రైలులో ప్రయాణించాల్సి వచ్చింది.. గడ్కరీకి స్టాలిన్ లేఖ
డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఈ సమస్యను పార్లమెంట్లో లేవనెత్తినట్లు స్టాలిన్ గుర్తు చేశారు. అయితే కేంద్ర మంత్రి గడ్కరీ దీనిపై ఇచ్చిన సమాధానం చాలా సాధారణంగా, నిబద్ధత లేన్నట్లుగా ఉందని విమర్శించారు.
చెన్నై: తమిళనాడులో జాతీయ రహదారి చాలా అధ్వాన్నంగా ఉందని సీఎం స్టాలిన్ విమర్శించారు. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలను సందర్శించేందుకు తాను రైలులో ప్రయాణించాల్సి వచ్చిందన్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఈ మేరకు ఒక లేఖ రాశారు. చెన్నై-రాణిపేట జాతీయ రహదారి దుస్థితిని అందులో పేర్కొన్నారు. కాంచీపురం, వెల్లూరు, రాణిపేట్, హోసూర్, కృష్ణగిరిలోని పారిశ్రామిక కారిడార్లను చెన్నై, ఇతర పోర్టులను కలిపే ముఖ్యమైన ఈ జాతీయ రహదారి గుంతలమయంగా మారి చాలా అధ్వాన్నంగా ఉందన్నారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఈ సమస్యను పార్లమెంట్లో లేవనెత్తినట్లు గుర్తు చేశారు. అయితే కేంద్ర మంత్రి గడ్కరీ దీనిపై ఇచ్చిన సమాధానం చాలా సాధారణంగా, నిబద్ధత లేన్నట్లుగా ఉందని విమర్శించారు.
కాగా, కేంద్ర రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఇతర అనుమతులపై తమిళనాడు ప్రభుత్వం సత్వరంగా స్పందించినప్పటికీ ఎన్హెచ్ఏఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదనే అభిప్రాయాన్ని నితిన్ గడ్కరీ తన సమాధానంలో వ్యక్తం చేయడం దురదృష్టకరమని సీఎం స్టాలిన్ ఆ లేఖలో పేర్కొన్నారు. జాతీయ రహదారి 4లోని శ్రీపెరంబుదూర్ నుంచి వాలాజాపేట్ సెక్షన్లో ఆరు వరుసల రోడ్డు పనులను కూడా ఆయన ప్రస్తావించారు. కాంట్రాక్టర్లు, ఎన్హెచ్ఏఐ మధ్య సమస్యల కారణంగా పనులు నిలిచిపోయినట్లు తెలిపారు. దీని వల్ల ప్రస్తుత రహదారి పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందన్నారు.
ఈ నేపథ్యంలో ఈ రహదారి నిర్మాణ పనుల గురించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని నితిన్ గడ్కరీని స్టాలిన్ కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరుఫున తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

