కరోనా కన్నా రోడ్డు ప్రమాదాలవల్లే ఎక్కువగా చనిపోయారు: గడ్కరీ

న్యూఢిల్లీ: గత ఏడాది కరోనా వైరస్ బారినవారి కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మరణించారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్‌సభలో గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణపై తమ ప్రభుత్వం దృష్టిపెట్టిందని చెప్పారు. గత ఏడాది దేశవ్యాప్తంగా కరోనా వల్ల 1.46 లక్షల మంది చనిపోగా రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మరణించారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో 18-35 వయసు గ్రూపు వారే ఎక్కువని చెప్పారు. రోడ్డు ప్రమాదాల గురించి తమ ప్రభుత్వం చాలా ఆందోళన చెందుతున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- Killed
- More
- Nitin Gadkari
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

