Special Status | కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తాం : ఆర్జేడీ నేత మనోజ్ ఝా
Special Status : కేంద్రంతో పోరాడి బిహార్‌కు ప్రత్యేక హోదా సాధిస్తామని ఆర్జేడీ నేత మనోజ్ ఝా అన్నారు. తాము రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్నామని చెప్పారు.
Special Status : కేంద్రంతో పోరాడి బిహార్‌కు ప్రత్యేక హోదా సాధిస్తామని ఆర్జేడీ నేత మనోజ్ ఝా అన్నారు. తాము రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించడంలో బిహార్ సీఎం నితీష్ కుమార్ విఫలమయ్యారని ఆరోపించారు. కేవలం ఒక సంతకంతో ప్రత్యేక హోదా లభిస్తుందని, కానీ కేంద్ర ప్రభుత్వం హోదా ఇవ్వాలని కోరుకోవడం లేదని మండిపడ్డారు.
కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజే ఎన్డీయే కూటమి (BJP-led NDA government)లో ముఖ్య పాత్ర పోషిస్తున్న జేడీయూకి (Janata Dal (United)) గట్టి షాక్ తగిలింది. నితీశ్ కుమార్ పాలిత రాష్ట్రం బీహార్ (Bihar)కు ప్రత్యేక హోదా (Special Status) అంశంపై కేంద్రం స్పష్టతనిచ్చింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో జేడీయూ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయే కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు జేడీయూ కూడా కీలకంగా మారిన విషయం తెలిసిందే. 12 మంది ఎంపీలతో కూటమిలో మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. దీంతో జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ డీల్‌తోనే ఎన్డీయే కూటమిలో జేడీయూ భాగమైందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. ప్రత్యేక హోదా లేని పక్షంలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది.
Read More :
August 15 Movies | ఆగస్టు 15న సినిమాల జాతర..! ఏమేం రిలీజు అవుతున్నాయంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

