Delhi Yamuna River | ఉప్పొంగి ప్రవహిస్తున్న యుమునా నది.. డేంజర్ జోన్ దాటడంతో అలెర్ట్
Delhi Yamuna River | ఉత్తరాది రాష్ర్టాల్లో వర్షాలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. గత మూడు రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీలోని యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఎగువన ఉన్న హర్యానా నుంచి వరద పోటెత్తడంతో నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో పెరిగింది.
Delhi Yamuna River | న్యూఢిల్లీ, జూలై 11: ఉత్తరాది రాష్ర్టాల్లో వర్షాలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. గత మూడు రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీలోని యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఎగువన ఉన్న హర్యానా నుంచి వరద పోటెత్తడంతో నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో పెరిగింది. మంగళవారం మధ్యాహ్నానికి నీటి మట్టం 206 మీటర్లు (డేంజర్ మార్క్ 205.33 మీటర్లు) దాటింది. నది ఒడ్డున ఉండే పలు సమీప లోతట్టు ప్రాంతాల్లోకి కూడా నీరు చేరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను సోమవారం రాత్రి ప్రారంభించారు. నదిపైన ఉండే పాత రైల్వే బ్రిడ్జిని మూసేశారు. ఢిల్లీకి వరద పరిస్థితి లేదని మంత్రి సౌరవ్ భరద్వాజ్ పేర్కొన్నారు.
హిమాచల్‌లో చిక్కుకొన్న 300 మంది
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా సరిహద్దులోని జుమ్మాగఢ్ నదిపై ఉండే ఓ వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. ఇండో-టిబెట్ సరిహద్దు రహదారి బ్లాక్ అయింది. డజనుకు పైగా సరిహద్దు గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లా చందేత్రల్‌లోని క్యాంపుల్లో దాదాపు 300 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. మేఘాలు తొలగిన తర్వాత హెలికాప్టర్ సాయంతో వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు.
నష్టం అంచనా పనిలో అధికారులు
వరద ప్రభావిత జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపశమన చర్యలు ప్రారంభించాయి. జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసేందుకు అధికారులు డాటా సేకరిస్తున్నారు. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

