Richa Chadha: గాల్వాన్‌పై నటి రిచా చద్దా వివాదాస్పద ట్వీట్
Richa Chadha: గాల్వాన్‌పై బాలీవుడ్ నటి రిచా చద్దా తాజాగా చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదం అవుతోంది. ఆమెపై సోషల్ మీడియాలో నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను చేజిక్కించుకునేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపా
న్యూఢిల్లీ: గాల్వాన్ ఘటనపై బాలీవుడ్ నటి రిచా చద్దా తాజాగా చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదం అవుతోంది. ఆమెపై సోషల్ మీడియాలో నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను చేజిక్కించుకునేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఆ ప్రకటనపై రిచా స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది. గాల్వాన్ హాయ్ చెబుతోంది అంటూ కామెంట్ చేసింది. ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం చెలరేగుతోంది.

రిచా చేసిన కామెంట్‌పై విమర్శలు వస్తున్నాయి. భారతీయ ఆర్మీని చాలా చులకన చేసినట్లు కొందరు ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు సిగ్గుచేటు, అవమానకరం అని కొందరు కామెంట్ చేశారు. 2020 మేలో గాల్వాన్‌లో చైనా, భారతీయ ఆర్మీ దళాల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆ గొడవలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణా త్యాగం చేశారు. ఆ గాల్వాన్ అమరవీరులను రిచా తన ట్వీట్‌తో అవమానపరిచినట్లు ఉందని నెటిజెన్లు విమర్శిస్తున్నారు.
తన ట్వీట్ వివాదాస్పదం కావడంతో .. నటి రిచా చద్దా క్షమాపణలు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

