‘జనాభా లెక్కల డాటాను ప్రెస్‌కు విడుదల చేయొద్దు’
2027 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా సేకరించిన ఎలాంటి డాటాను లేదా గణాంకాలను ప్రెస్‌కు విడుదల చేయవద్దని, లేదా ఎక్కడా ఉపయోగించవద్దని దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్జీఐ) ఆదేశించింది. ఈ విషయాన్ని ఆర్జీఐ సెన్సెస్ కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జనాభా లెక్కల్లో సేకరించే సమాచారం అత్యంత గోప్యమైనదని, 1948 సెన్సెస్ చట్టంలోని నిబంధనల ప్రకారం దానికి రక్షణ ఉంటుందని ఆయన తెలిపారు.
న్యూఢిల్లీ: 2027 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా సేకరించిన ఎలాంటి డాటాను లేదా గణాంకాలను ప్రెస్‌కు విడుదల చేయవద్దని, లేదా ఎక్కడా ఉపయోగించవద్దని దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్జీఐ) ఆదేశించింది. ఈ విషయాన్ని ఆర్జీఐ సెన్సెస్ కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జనాభా లెక్కల్లో సేకరించే సమాచారం అత్యంత గోప్యమైనదని, 1948 సెన్సెస్ చట్టంలోని నిబంధనల ప్రకారం దానికి రక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. సెన్సెస్ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం జనాభా లెక్కల రికార్డులను ఎవరూ తనిఖీ చేయడానికి వీలుండదని, వాటిని సాక్ష్యంగా కూడా పరిగణించలేమని అన్నారు. ఈసారి జనాభా లెక్కలు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతున్నాయి. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, తమ సొంత మొబైళ్ల ద్వారా డాటాను సేకరించి సెంట్రల్ సర్వర్‌కు పంపిస్తున్నారు. టెక్నికల్ సమస్యలు లేదా కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో పేపర్ షెడ్యూళ్ల ద్వారా డాటా సేకరిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

