Goods train : గూడ్స్ రైలు (Goods train) పట్టాలు తప్పిన ప్రాంతంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. బికనీర్ నుంచి జైసల్మేర్ (Bikaner-Jaisalmer) కు వెళ్తున్న గూడ్స్ రైలు లాల్గఢ్-ఫలోడీ (Lalgarh-Phalodi) మార్గంలో పట్టాలు తప్పింది. గంజేర్-కొలాయట్ (Ganjer-Kolayat) రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. మంగళవారం ఉదయం 7.40 గంటలకు చనీ గ్రామం సమీపంలో గూడ్స్ రైలు పట్టాలపై నుంచి పక్కకు దూసుకెళ్లగా.. బోగీలన్నీ చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ఆ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లను దారిమళ్లించారు. మరికొన్ని రైళ్లను నిలిపివేశారు. రైల్వే పునరుద్ధరణ పనులు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు కూడా పనులు కొనసాగుతున్నాయి.
#WATCH | Sikar, Rajasthan | Restoration work underway after a goods train derailed near Shri Madhopur railway station. pic.twitter.com/1HfAiamTwn
— ANI (@ANI) October 8, 2025