Gas Cylinder | మైగ్రేంట్ లేబర్‌కు కేంద్రం శుభవార్త.. 5 కిలోల గ్యాస్ సిలిండర్ సరఫరా రెట్టింపు
Gas Cylinder | వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వలస కార్మికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు ఊరట కలిగించేలా వారికి 5 కేజీల ఎఫ్టీఎల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు.
Gas Cylinder : వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వలస కార్మికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు ఊరట కలిగించేలా వారికి 5 కేజీల ఎఫ్టీఎల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు.
ఓఎంసీల సాయంతో పౌర సరఫరాల శాఖ ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని నీరజ్ సూచించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హర్మూజ్ జలసంధి గుండా ఇరాన్ కొన్ని దేశాలను మాత్రమే అనుమతిస్తుండటంతో మిగతా దేశాలు అవస్థలు పడుతున్నాయి. భారత చమురు నౌకలను ఇరాన్ వదిలిపెడుతున్నప్పటికీ మునుపటి స్థాయిలో దేశంలో గ్యాస్ సరఫరా జరగడంలేదు.
ఫలితంగా రెగ్యులర్ సిలిండర్ పొందడానికి కావాల్సిన నిబంధనలను ఇప్పుడు కచ్చితంగా అమలు చేస్తున్నారు. అయితే 5 కేజీల చోటు సిలిండర్‌కు మాత్రం కేవలం ఐడీ ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది. ఒకప్పుడు వలస కార్మికులను దృష్టిలో పెట్టుకునే ఈ సిలిండర్లను తీసుకొచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్‌ను తొందరగా పొందడం కష్టంగా మారింది. అందుకే కేంద్ర సర్కారు వలసకార్మికుల సౌలభ్యం కోసం 5 కేజీల సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

