కట్నం సొమ్ము వాపసు తీసుకోవచ్చు!.. విడాకులు పొందిన ముస్లిం మహిళకు సుప్రీంకోర్టులో ఊరట
వివాహ సమయంలో తన తల్లిదండ్రులు అందచేసిన నగదు, బంగారం, ఇతర బహుమతులను మాజీ భర్త నుంచి వాపసు తీసుకునే హక్కు విడాకులు పొందిన ముస్లిం మహిళకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మాజీ భర్త నుంచి ఈ బహుమతులను తిరిగి పొందే హక్కు ఆమెకు లేదంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ : వివాహ సమయంలో తన తల్లిదండ్రులు అందచేసిన నగదు, బంగారం, ఇతర బహుమతులను (Dowry) మాజీ భర్త నుంచి వాపసు తీసుకునే హక్కు విడాకులు పొందిన ముస్లిం మహిళకు (Muslim Woman) ఉందని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. మాజీ భర్త నుంచి ఈ బహుమతులను తిరిగి పొందే హక్కు ఆమెకు లేదంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ వివాదాన్ని ఓ సివిల్ వ్యవహారంగానే కలకత్తా హైకోర్టు చూసిందే తప్ప 1986 చట్టం విస్తృత ఆశయాన్ని చూడలేదని అభిప్రాయపడింది. 2005లో ఓ ముస్లిం జంటకు వివాహమైంది. వైవాహిక స్పర్థల కారణంగా 2009 మే 7న భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. మనోవర్తి కేసును దాఖలు చేయడంతోపాటు గృహహింస కింద కూడా ఆమె ఫిర్యాదు చేసింది.
2011 డిసెంబర్ 13న విడాకులు మంజూరయ్యాయి. అనంతరం ఆ మహిళ వివాహ సమయంలో అత్తింటి వారికి ఇచ్చిన నగదు, బంగారం, గృహోపకరణాలు వాపసు చేయాలని కోరుతూ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిపై ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పు రాగా దీన్ని ఆమె భర్త కలకత్తా హైకోర్టులో సవాలు చేశారు. మహిళ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు.. నగదు, బంగారాన్ని ఆమె భర్త వాపసు చేయాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

