నోయిడా, జూన్ 23: సోషల్ మీడియాలో రీల్స్ కోసం కాదేదీ అనర్హం అనే విధంగా ఇటీవల పలు ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. కొందరు తమ వీడియోలకు భారీ సంఖ్యలో వ్యూస్ కోసం ఎంతటి రిస్క్కైనా పాల్పడుతున్నారు. తాజాగా ఇద్దరు యువకులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఓ కదులుతున్న రైలుపై స్టంట్లు చేశారు.
అర్ధనగ్నంగా కండలు ప్రదర్శిస్తూ విన్యాసాలు చేశారు. గ్రేటర్ నోయిడా పరిధిలో చోటుచేసుకొన్న ఈ ఘటనకు సంబంధించి ఆ ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్టు ఆర్పీఎఫ్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఇద్దరు యువకులు 19, 22 ఏండ్ల కాలేజీ విద్యార్థులు. వారు ఈ నెల 21న తీసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో, పోలీసులు వారిని అదుపులోకి తీసుకొన్నారు.