క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యమైనా చార్జీల్లేవ్
క్రెడిట్ కార్డుదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గొప్ప ఊరటనిచ్చింది. చెల్లింపులు ఆలస్యమైనా చార్జీలు పడకుండా కొత్త నిబంధనల్ని తెచ్చింది. సవరించిన రూల్స్ ప్రకారం.. గడువు తేదీ 2-3 రోజులు దాటినా ఓవర్‌డ్యూగా పరిగణించబడదు.
- యూజర్లకు ఆర్బీఐ ఊరట
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: క్రెడిట్ కార్డుదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గొప్ప ఊరటనిచ్చింది. చెల్లింపులు ఆలస్యమైనా చార్జీలు పడకుండా కొత్త నిబంధనల్ని తెచ్చింది. సవరించిన రూల్స్ ప్రకారం.. గడువు తేదీ 2-3 రోజులు దాటినా ఓవర్‌డ్యూగా పరిగణించబడదు.
- చెల్లింపు గడువు తేదీ దాటి 3 రోజులైనా చెల్లింపులు జరుపకపోతేనే లేట్ పేమెంట్ చార్జీలు వేయాలని, సిబిల్ తదితర క్రెడిట్ బ్యూరోలకు సదరు ఖాతాను గడువు దాటినదిగా నివేదించాలని బ్యాంకర్లకు ఆర్బీఐ స్పష్టం చేసింది.
- ఆలస్యపు చెల్లింపు ఫీజును మొత్తం బిల్లుపై కాకుండా గడువు తేదీ మించిన తర్వాత మిగిలిన మొత్తాలపై లెక్కించి మాత్రమే విధించాలని పేర్కొన్నది.
- ఫీజుల్లో ఏవైనా తేడాలు చేయాలనుకుంటే కస్టమర్లకు కనీసం 30 రోజుల ముందే తెలియజేయాలి.
- కార్డును మూసివేయాలన్న విజ్ఞప్తులను 7 రోజుల్లోగా పరిష్కరించాలి. లేకపోతే రోజుకు రూ.500 చొప్పున కస్టమర్‌కు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
- కస్టమర్ ఫిర్యాదును బ్యాంకులు 30-60 రోజుల్లోగా పరిష్కరించాలి. లేనిపక్షంలో కస్టమర్లకు ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు.
- వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

