Ratna Bhandar: రత్నభండార్ లొపలి గదిలోని ఆభరణాల తరలింపు.. రిపేర్ వర్క్ చేయనున్న ఏఎస్ఐ
Ratna Bhandar: ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న రత్నభండార్‌లోని లొపలి గదిని ఇవాళ తెరిచారు. ఆ గదిలో ఉన్న విలువైన వస్తువులను.. తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌కు తరలిస్తున్నారు.
పూరి: ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న రత్నభండార్(Ratna Bhandar)లోని లొపలి గదిని ఇవాళ తెరిచారు. ఆ గదిలో ఉన్న విలువైన వస్తువులను.. తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌కు తరలిస్తున్నారు. ఈ వారంలోనే రత్నభండార్‌ను తెరవడం ఇది రెండవసారి. ఇవాళ ఉదయం 9.51 నిమిషాలకు ఆ గదిని ఓపెన్ చేశారు. జగన్నాథుడికి పూజలు చేసిన తర్వాత.. ఒడిశా సర్కార్ నియమించిన సూపర్వైజరీ కమిటీ .. రత్నభండార్‌లోకి అడుగుపెట్టింది. జూలై 14వ తేదీన బయటి గదిలో ఉన్న అమూల్యమైన ఆభరణాలు, ఇతర వస్తువులను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం వరకు లొపలిగదిలోని ట్రెజరీ పెట్టలను తరలించనున్నట్లు కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వంత్ రాథ్ తెలిపారు. పూరి రాజు గజపతి మహారాజ దివ్య సింగ్ దేబ్ సమక్షంలోనే .. ఆభరణాలు, విలువైన వస్తువులను స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తున్నారు. ఆభరణాల తరలింపు ప్రక్రియను వీడియో తీస్తున్నారు. పాములు పట్టేవాళ్లతో పాటు ప్రత్యేక భద్రతా సిబ్బంది.. ఆలయం వద్దే ఉన్నారు.
షెడ్యూల్ ప్రకారమే 11 మంది సభ్యులు బృందం రత్నభండార్‌లోని ఇన్నర్ ఛాంబర్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం లొపలి గదిలో ఉన్న ఆభరణాలు, వస్తువులను ఖటేషేజా రూమ్‌కు తరలిస్తున్నారు. షిఫ్టింగ్ పూర్తి అయిన తర్వాత ఆ రూమ్‌ను సీల్ చేయనున్నారు. ఆ తర్వాత లోపలి గదిలో పురావాస్తుశాఖ ఆధ్వర్యంలో రిపేర్ చేయనున్నారు. రిపేర్ వర్క్ పూర్తి అయిన తర్వాత.. ఇన్వెంటరీ వర్క్ మొదలవుతుందని పూరీ గజపతి మహారాజు దివ్యసింగ్ దేబ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

