Covid-19 | కొవిడ్ సోకిన పిల్లల్లో వేగంగా డయాబెటిస్ లక్షణాలు
పిల్లల్లోగానీ, పెద్దల్లోగానీ టైప్-1 డయాబెటిస్ లక్షణాలు అంత త్వరగా బయటపడవు. అయితే కొవిడ్ సోకిన పిల్లల్లో టైప్1 డయాబెటిస్ లక్షణాలు వేగంగా బయటపడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
Covid-19 | న్యూఢిల్లీ, జూలై 17: పిల్లల్లోగానీ, పెద్దల్లోగానీ టైప్-1 డయాబెటిస్ లక్షణాలు అంత త్వరగా బయటపడవు. అయితే కొవిడ్ సోకిన పిల్లల్లో టైప్1 డయాబెటిస్ లక్షణాలు వేగంగా బయటపడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘అమెరికన్ మెడికల్ అసోసియేషన్’ జర్నల్ నివేదిక ప్రకారం.. విపరీతమైన దాహం, తరుచూ మూత్ర విసర్జన, నిద్రలేమి, వంటివి టైప్-1 డయాబెటిస్‌లో ప్రధాన లక్షణాలు. పిల్లల్లో, పెద్దల్లో ఈ లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడతాయి. కొవిడ్-19 బారినపడ్డ పిల్లల్లో మాత్రం.. ఆటోఇమ్యూన్ డిజార్డర్‌తో టైప్-1 డయాబెటిస్‌ను వెంటనే గుర్తించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ‘రోగ నిరోధక వ్యవస్థ’ ప్యాంక్రియాస్పైనా దాడి చేసి దెబ్బ కొడుతుంది. రక్త పరీక్షతో ఇన్సులిన్ కణాల తీరును పరిశీలించి టైప్-1 డయాబెటిస్‌ను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చునని అధ్యయనం వివరించింది.
ఇంకా చదవల్సిన వార్తలు
భారత్‌లో ఫేక్ ఈ-చలాన్ స్కామ్
న్యూఢిల్లీ, జూలై 17: వాట్సాప్‌ల్లో ఫేక్ ఈ-చలాన్లు పంపుతూ వియత్నాం హ్యాకర్లు పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. హ్యాకర్ల దాడితో.. భారత్‌లోని 4,400 మొబైల్ ఫోన్లకు మాల్వేర్ సోకిందని, మోసపూరిత ఆర్థిక లావాదేవీలతో హ్యాకర్లు రూ.16 లక్షలు కొల్లగొట్టారని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘క్లౌడ్‌సెక్’ తాజాగా వెల్లడించింది. తొలుత హ్యాకర్లు వాట్సాప్ ద్వారా ఫేక్-ట్రాఫిక్ చలాన్ నోటీసుల్ని పంపుతారు. వాటిపై క్లిక్ చేయగానే యూజర్ల మొబైల్ ఫోన్లలోకి మాల్వేర్ ప్రవేశిస్తుంది. దీంతో ఓటీపీ నెంబర్లు సహా అంతా హ్యాకర్లకు తెలిసిపోతున్నది. ఈ-కామర్స్ సైట్లలోకి వెళ్లి మోసపూరిత ఆర్థిక లావాదేవీలకు హ్యాకర్లు పాల్పడ్డారని ‘క్లౌడ్‌సెక్’ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

