Dera Baba | డేరా బాబకు మరోసారి పెరోల్.. నాలుగేళ్లలో తొమ్మిదోసారి..!
Dera Baba | ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ (Dera Sacha Sauda) చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim Singh) అలియాస్ డేరా బాబకు మరోసారి పెరోల్ లభించింది.
Dera Baba | ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ (Dera Sacha Sauda) చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim Singh) అలియాస్ డేరా బాబకు మరోసారి పెరోల్ లభించింది. కోర్టు ఈసారి 50 రోజులపాటు పెరోల్ (parole) మంజూరు చేసింది. ఈ మేరకు హరియాణాలోని రోహ్తక్ సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న అతనికి పెరోల్ మంజూరు చేస్తు అక్కడి కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. తాజా తీర్పుతో డేరా బాబకు 24 నెలల్లో పెరోల్ లభించడం ఇది ఏడోసారి కావడం గమనార్హం.
2017లో ఇద్దరు శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ అయిన తరువాత కోర్టు అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రెండు అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్యల్లో జీవిత ఖైదు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం అతడు హరియాణాలోని రోహ్తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఆయన వివిధ కారణాలతో పలుమార్లు పెరోల్‌పై బయటకు వస్తున్న విషయం తెలిసిందే.
గత రెండేళ్లలో ఆయనకు ఏడుసార్లు పెరోల్ (తాజా పెరోల్తో కలిపి) లభించగా.. నాలుగేళ్లలో మొత్తంగా తొమ్మిదిసార్లు పెరోల్‌పై బయటకు వచ్చాడు. గతేడాది జనవరిలో 40 రోజులు, జులైలో 30 రోజులు, నవంబర్‌లో కూడా 21 రోజులపాటు పెరోల్‌పై బయటకు వచ్చాడు. మొత్తంగా గతేడాది 91 రోజులపాటు ఆయన పెరోల్‌పై బయటే ఉన్నాడు. మళ్లీ తాజాగా ఇప్పుడు కూడా పెరోల్ లభించింది. ఇక 2022లో మూడుసార్లు పెరోల్ లభించింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో 21 రోజులు, జూన్‌లో (నెలరోజులు), అక్టోబర్‌లో 40 రోజుల పాటు జైలు నుంచి బయటకు వచ్చారు. ఇక 2020, 2021లో కూడా పలుమార్లు అతడికి పెరోల్ లభించింది.
Also Read..
Plane Catches Fire | విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం.. VIDEO
Republic Day | రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. ఢిల్లీలో విమానాల రాకపోకలపై ఆంక్షలు
SC Classification | ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ముందడుగు.. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

