Plane Catches Fire | అట్లాస్ ఎయిర్ (Atlas Air)కు చెందిన ఓ బోయింగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా మంటలు చెలరేగాయి (Plane Catches Fire). అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలోని మియామీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (Miami International Airport)లో గత రాత్రి చోటు చేసుకుంది.
అట్లాస్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 747-8 కార్గో విమానం (Boeing Cargo Plane) గురువారం రాత్రి ఫ్లోరిడాలోని మియామీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తి ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని వెనక్కి మళ్లించారు. తిరిగి మియామీ ఎయిర్‌పోర్ట్‌లోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. విమానం గగనతలంలో ఉండగా మంటలు చెలరేగిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
💥#BREAKING: Atlas Air Boeing 747-8 catches fire with sparks shooting out during mid flight.#Miami | #Florida #boeing7478 #atlasair pic.twitter.com/3IO5xFvMr6
— Noorie (@Im_Noorie) January 19, 2024
Also Read..
Republic Day | రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. ఢిల్లీలో విమానాల రాకపోకలపై ఆంక్షలు
German Singer | జర్మన్ సింగర్ నోట.. రామ్ అయేంగే పాట.. VIDEO
SC Classification | ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ముందడుగు.. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు