Ayodhya | ఏకధాటిగా 18 గంటలు దర్శనమిస్తున్న బాల రాముడు..!
Ayodhya | అయోధ్య రామ మందిరానికి భక్తుల తాకిడి కొనసాగుతున్నది. భారీగా తరలివచ్చిన భక్తులతో బాల రాముడు నిరంతరాయంగా దర్శనమిస్తున్నాడు. మూడోరోజు తెల్లవారు జామున 4 గంటలకు బాల రాముడి మేల్కొలుపగా.. రాత్రి 10 గంటల వరకు దర్శనాలు కొనసాగాయి.
Ayodhya | అయోధ్య రామ మందిరానికి భక్తుల తాకిడి కొనసాగుతున్నది. భారీగా తరలివచ్చిన భక్తులతో బాల రాముడు నిరంతరాయంగా దర్శనమిస్తున్నాడు. మూడోరోజు తెల్లవారు జామున 4 గంటలకు బాల రాముడి మేల్కొలుపగా.. రాత్రి 10 గంటల వరకు దర్శనాలు కొనసాగాయి. హారతి, నివేదన సమయాన్ని తగ్గించారు. యావత్ భారతదేశంతో పాటు విదేశాల నుంచి రామ్‌లల్లా దర్శనానికి భక్తులు బారులు తీరి బాల రాముడిని దర్శనం చేసుకున్నారు. మంగళ, శృంగార హారతి సందర్భంగా డ్రైఫ్రూట్స్, రాబ్డీని నివేదించారు. అనంతరం ఉదయం 6.30 గంటల దర్శనాలు ప్రారంభం కాగా.. జైరామ్ నినాదాలతో ఆలయం మార్మోగింది.
మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనాలు కొనసాగాయి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు రాజ్‌భోగ్, హారతి కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్లీ ఆరుగంటల వరకు దర్శనాలు కొనసాగాయి. సూర్యాస్తమయం తర్వాత మరోసారి సాయంత్రం హారతి సమయంలో నైవేద్యాన్ని సమర్పించారు. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు దర్శనాలను నిలిపివేశారు. హారతి, నైవేద్యం నివేదన అనంతరం బాల రాముడి పవళింపు సేవ నిర్వహించారు. ప్రస్తుతం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ద్వారా భవ్య మందిరంలోనూ భక్తులకు ఏలకులు మాత్రమే ప్రసాదంగా అందజేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

