Ayodhya Ram Mandir | 17న అయోధ్యలో రామయ్య ఊరేగింపు రద్దు.. ఎందుకంటే?
రామజన్మ భూమి అయోధ్యలో (Ayodhya) రామ మందిర ప్రారంభోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామయ్య ప్రాణ ప్రతిష్ఠను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
అయోధ్య: రామజన్మ భూమి అయోధ్యలో (Ayodhya) రామ మందిర ప్రారంభోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామయ్య ప్రాణ ప్రతిష్ఠను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపణకు వారం రోజుల ముందే ఆచార వ్యవహారాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి 22 వరకు మహామస్తకా అభిషేక కార్యక్రమాలు వారం రోజులపాటు కొనసాగుతాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను రామజన్మభూమి (Ram Janmabhoomi) తీర్థ క్షేత్ర ట్రస్టు ఇప్పటికే విడుదల చేసింది. అయితే తాజాగా అందులో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. జనవరి 17న నిర్వహించ తలపెట్టిన బాలరాముడి రూపంలో ఉన్న రామయ్య (Ram Lalla) విగ్రహ ఊరేగింపును రద్దుచేసింది. భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనే ఆందోళన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. కాగా, అదే రోజున రామజన్మభూమి ప్రాంగణంలో కొత్త విగ్రహాన్ని ప్రదర్శిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.
రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు..
- జనవరి 16న ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. సరయూ నది ఒడ్డున ‘దశవిధ’ స్నానం జరుగుతుంది. విష్ణుపూజ , గోదానాన్ని చేస్తారు.
- జనవరి 17న రామజన్మభూమి ప్రాంగంలో బాలరాముడి విగ్రహ ప్రదర్శన
- జనవరి 18న గణేశ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ వరణం, వాస్తు పూజ వంటి ధార్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
- జనవరి 19న అగ్ని పూజ, నవగ్రహ పూజ, యజ్ఞ యాగాలను నిర్వహిస్తారు.
- జనవరి 20న, రామమందిరంలోని గర్భగుడిని సరయు పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. అనంతరం వాస్తు శాంతి, అన్నదానంతో పాటు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- జనవరి 21న బాల రాముని విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయిస్తారు.
- జనవరి 22న విగ్రహానికి పూజలు నిర్వహించి మధ్యాహ్నం మృగశిర నక్షత్రంలో అభిషేకం నిర్వహిస్తారు. శ్రీరామ్ లల్లా మూర్తిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

