Rajya Sabha Adjourn: రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
Rajya Sabha Adjourn: రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు తమతమ డిమాండ్లను లేవనెత్తారు. విపక్షాల విపక్షాల డిమాండ్లను పట్టించుకోకుండా సభా కార్యకలాపాలు కొనసాగించే ప్రయత్నం చేసినా

న్యూఢిల్లీ: రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. పన్నెండు మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత, పంటలకు కనీస మద్దతు ధర కోసం విపక్షాల డిమాండ్లు, తెలంగాణలో ధాన్యం సేకరణకు సమగ్ర విధానం తీసుకురావాలంటూ టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన నేపథ్యంలో శీతాకాల సమావేశాల ప్రారంభం నుంచి పెద్దల సభలో రభస కొనసాగుతున్నది. దీనికి తోడు మూడు రోజుల క్రితం నాగాలాండ్‌లో భద్రతాబలగాలు.. ఉగ్రవాదులుగా పొరబడి పౌరులను కాల్చిచంపడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది.
ఈ క్రమంలో ఇవాళ కూడా రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు తమతమ డిమాండ్లను లేవనెత్తారు. విపక్షాల డిమాండ్లను పట్టించుకోకుండా సభా కార్యకలాపాలు కొనసాగించే ప్రయత్నం చేసినా సాధ్యంకాలేదు. దాంతో సభ మొదలైన ఐదు నిమిషాలకే సభాపతి రాజ్యసభను మధ్యాహ్నం రెండు గంటలవరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

