Kanwar Yatra | కన్వర్ యాత్రలో నేమ్‌ప్లేట్స్ వ్యవహారంపై సుప్రీం ఉత్తర్వులు హర్షణీయం : కాంగ్రెస్
Kanwar Yatra : కన్వర్ యాత్ర మార్గంలో దుకాణదారులు తమ యజమానుల పేర్లను ప్రదర్శించే నేమ్‌బోర్డులను ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
Kanwar Yatra : కన్వర్ యాత్ర మార్గంలో దుకాణదారులు తమ యజమానుల పేర్లను ప్రదర్శించే నేమ్‌బోర్డులను ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తమ దుకాణాల్లో ఎలాంటి ఆహార పదార్ధాలు లభిస్తాయో యజమానులు డిస్ప్లేలో వెల్లడించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
యజమానుల పేర్లతో దుకాణదారులు బోర్డులు ఏర్పాటుచేయాలని యోగి సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను విపక్షాలు దుయ్యబట్టాయి. యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వివక్షతో కూడినవని ఆరోపించగా శాంతిభద్రతల అంశాలను దృష్టిలో ఉంచుకునే ఈ ఉత్తర్వులు జారీ చేశామని బీజేపీ సమర్ధించుకుంది. ఇక సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులను కాంగ్రెస్ స్వాగతించింది.
సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకున్నదని తాను భావిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో రాజకీయ లబ్ధి కోసం అనవసరంగా తెరపైకి తీసుకొచ్చిన వివాదం సమసిపోతుందని అన్నారు. న్యాయస్ధానం నిర్ణయంతో సమాజంలో శాంతి సామరస్యాలు, సామాజిక ఐక్యత వెల్లివిరుస్తాయని ఆకాంక్షించారు. మంచి నిర్ణయం తీసుకున్నందుకు సర్వోన్నత న్యాయస్ధానానికి తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
Read More :
Janhvi Kapoor | జాన్వీకపూర్ అసహనమంతా అతనిపైనే.. ఎందుకోమరి?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

