Janhvi Kapoor | జాన్వీకపూర్ అసహనమంతా అతనిపైనే.. ఎందుకోమరి?
ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రి పాలైన జాన్వీకపూర్, శనివారం డిస్చార్జ్ అయ్యింది. ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నదని ఆమె తండ్రి బోనీకపూర్ తెలిపారు. ఇదిలావుంటే.. ఇటీవల తన ప్రేమ గురించీ, తన ప్రియుడి గురించీ ఆసక్తికరంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది జాన్వీ.
Janhvi Kapoor | ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రి పాలైన జాన్వీకపూర్, శనివారం డిస్చార్జ్ అయ్యింది. ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నదని ఆమె తండ్రి బోనీకపూర్ తెలిపారు. ఇదిలావుంటే.. ఇటీవల తన ప్రేమ గురించీ, తన ప్రియుడి గురించీ ఆసక్తికరంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది జాన్వీ. ‘పిరియడ్స్ టైమ్‌లో నాకు చికాకు ఎక్కువగా ఉండేది. ఆ అసహనం అంతా నా బాయ్ఫ్రెండ్పైనే చూపించేదాన్ని. ఆ టైమ్ వచ్చిందంటే చాలు తనకు బ్రేక్అప్ చెప్పేసేదాన్ని. తర్వాత నేనే ఏడ్చుకుంటూ వెళ్లి సారీ చెప్పేదాన్ని. మొదట్లో బ్రేక్అప్ చెప్పినప్పుడు తను షాక్ అయ్యాడు. తర్వాత నా పరిస్థితి అర్థం చేసుకొని, ఆ టైమ్‌లో నేనేం అన్నా పట్టించుకోవడం మానేశాడు.’ అంటూ నవ్వుతూ చెప్పింది జాన్వీ.
పెళ్లెప్పుడు చేసుకుంటావ్? అనడిగితే ‘ఎప్పుడు చేసుకుంటానో చెప్పలేను. ఎక్కడ చేసుకుంటానో చెప్తా. నా పెళ్లి కచ్ఛితంగా తిరుమలలోనే జరుగుతుంది. అది మా అమ్మమ్మ పుట్టిన ఊరు. పైగా నా ఇష్టదైవం బాలాజీ. అందుకే.. అక్కడే నా పెళ్లి’ అని చెప్పింది జాన్వీ. మహారాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియాతో జాన్వీకపూర్ రిలేషన్లో ఉన్నదని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ బీటౌన్‌లో కలిసి పార్టీలకు హాజరవ్వడం, పుణ్యక్షేత్రాలకు కలిసి సందర్శించడం వీరి అనుబంధంపై వస్తున్న వార్తల్ని బలపరుస్తున్నాయి. రీసెంట్ గా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలోనూ వీరు కలిసే పాల్గొనడం గమనార్హం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

