బాల్య వివాహ సవరణ బిల్లుపై వెనక్కి తగ్గిన రాజస్థాన్

జైపూర్: బాల్య వివాహల సవరణ బిల్లుపై రాజస్థాన్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకున్నది. మైనర్లతో సహా అన్ని వివాహాలను రిజిస్టర్ చేయాలని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తెచ్చిన చట్టంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో గెహ్లాట్ సర్కార్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. గవర్నర్ వద్దకు పంపిన బాల్య వివాహాల సవరణ బిల్లును వెనక్కి తీసుకురానున్నట్లు సీఎం గెహ్లాట్ చెప్పారు. నిజానికి రాజస్థాన్‌లో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువ. అయితే ఆ ఆచారాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. బాల్య వివాహలను అడ్డుకునేందుకు ఆ పెళ్లిళ్లు రిజిస్టర్ చేయాలన్న చట్టాన్ని తెచ్చారు. అయితే ఆ సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆందోళనలు మిన్నంటాయి. మైనర్ వివాహాలను రిజిస్టర్ చేయాలని కోరితే, దాని వల్ల బాల్య వివాహాలను ఎంకరేజ్ చేసినట్లు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
18 ఏళ్ల లోపు అమ్మాయిలు, 21 ఏళ్ల లోపు అబ్బాయిలు ఒకవేళ పెళ్లి చేసుకుంటే, వాళ్లు కచ్చితంగా పెళ్లి రిజిస్టర్ చేయాలని కొత్త చట్టంలో పేర్కొన్నారు. ఆ చట్టం పట్ల అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బాల్య వివాహాలను రూపుమాపాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఉందని సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. బాల్య వివాహాలను అడ్డుకునే విషయంలో తామేమి వెనుకడుగు వేయబోమన్నారు. అన్ని పెళ్లిళ్లు రిజిస్టర్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడే కొత్త చట్టాన్ని రూపొందించినట్లు గెహ్లాట్ చెప్పారు. కానీ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో గవర్నర్ వద్ద ఉన్న సవరణ బిల్లును వెనక్కి రప్పించనున్నట్లు సీఎం గెహ్లాట్ వెల్లడించారు. సెప్టెంబర్ 17వ తేదీన బాల్య వివాహాల సవరణ బిల్లును పాస్ చేశారు. కానీ ఆ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ.. సభ నుంచి వాకౌట్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేదల గుడిసెలపై బుల్డోజర్లు
అగ్రి వర్సిటీలో ఆందోళన
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

