Rahul Gandhi | అమేధి బరిలో రాహుల్ గాంధీ..వారణాసి నుంచి ప్రియాంక గాంధీ..!
2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని అమేధి నుంచి కాంగ్రెస్ నేత, వయనాద్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బరిలో దిగుతారని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ : 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని అమేధి నుంచి కాంగ్రెస్ నేత, వయనాద్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బరిలో దిగుతారని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ పేర్కొన్నారు. అమేధి నుంచి రాహుల్ తిరిగి పోటీ చేస్తే కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీతో ఆయన నేరుగా తలపడతారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌పై స్మృతి ఇరానీ 55,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గాంధీ కుటుంబానికి కంచుకోటగా పేరొందిన అమేధిలో రాహుల్ గాంధీని పోటీ చేయించేందుకు 2004లో ఈ సీటును సోనియా గాంధీ ఖాళీ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ అమేధి, వయనాద్ లోక్‌సభ స్ధానాల నుంచి పోటీ చేయగా వయనాద్ నుంచి గెలుపొందారు.
ఇక ప్రియాంక గాంధీ వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేయాలని భావిస్తే పార్టీ కార్యకర్తలందరూ ఆమె విజయం కోసం శ్రమిస్తారని అజయ్ రాయ్ తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రియాంక గాంధీ ప్రధాని వారణాసిలో మోదీతో తలపడతారని భావించినా చివరిక్షణంలో వారణాసి నుంచి అజయ్ రాయ్‌ను కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ అజయ్ రాయ్ మోదీపై పోటీ చేసి ఓటమి చవిచూశారు.
Read More :
Himachal Floods | హిమాచల్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి : సుఖ్వీందర్ సింగ్ సుఖు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

