Rahul Gandhi – NEET | 24 లక్షల మంది భవితవ్యం ఆందోళనకరమైనా ప్రధాని ‘మౌన ముద్ర’.. కడిగి పారేసిన రాహుల్ ..!
Rahul Gandhi-NEET | ‘నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఆందోళనకరంగా మారుతున్నా ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
Rahul Gandhi – NEET | ఎంబీబీఎస్ సహా పలు వైద్య విద్యాకోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ‘నీట్ యూజీ-2024’లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు ‘మౌనం’గా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పరీక్షా పత్రాల లీకేజీకి వ్యతిరేకంగా సమర్థవంతమైన విధానాలు రూపొందించాలని కోరుతూ పార్లమెంట్ లోనూ, పార్లమెంట్ బయటా యువత పక్షాన వాణి వినిపిస్తాం అని మంగళవారం ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికపై ఒక పోస్టు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు బీహార్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో పరీక్షల్లో ‘వ్యవస్థీకృత అవినీతి’ చోటు చేసుకుందని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పరీక్షా పత్రాల లీకేజీకి బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్రంగా నిలిచాయని ఎద్దేవా చేశారు.
‘నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఆందోళనకరంగా మారుతున్నా ప్రధాని నరేంద్రమోదీ సహజ సిద్ధంగా మౌనం పాటిస్తున్నారు’ అని ‘ఎక్స్’లో హిందీలో రాశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పరీక్షా పత్రాల లీకేజీకి కేంద్రంగా మారాయనడానికి ఆ రాష్ట్రాల్లో జరుగుతున్న అరెస్టులే నిదర్శనం అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వివిధ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి యువత భవిష్యత్‌కు బాటలు వేస్తామని కాంగ్రెస్ పార్టీ తన లోక్ సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. యువత వాణిని వినిపించేందుకు, వారి భవిష్యత్ కోసం కఠిన విధానాలు రూపొందించేందుకు కేంద్రంపై విపక్ష పార్టీగా ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. నీట్ యూజీ -2024 నిర్వహణలో ‘0.001 శాతం’ నిర్లక్ష్యం జరిగినా సహించే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

