Rahul Gandhi | నిషేధిత చైనా డ్రోన్ ఎగరేసిన రాహుల్ గాంధీ.. వెల్లువెత్తిన విమర్శలు
Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మరో వివాదం చుట్టుముట్టింది. నిషేధిత చైనా డ్రోన్‌ను ఆయన ఎగురవేశారు. ఇలాంటి టెక్నాలజీ దేశంలో లేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని (Rahul Gandhi) మరో వివాదం చుట్టుముట్టింది. నిషేధిత చైనా డ్రోన్‌ను ఆయన ఎగురవేశారు. ఇలాంటి టెక్నాలజీ దేశంలో లేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. రాహుల్ గాంధీ శనివారం ఎక్స్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. 2022లో భారత్ నిషేధించిన చైనాలోని షెన్జెన్కు చెందిన డీజేపీ టెక్నాలజీ కంపెనీ తయారు చేసిన డ్రోన్ ఎగురవేశారు. ఆ తర్వాత డ్రోన్స్ అండ్ వార్స్ గురించి ఆయన మాట్లాడారు.
కాగా, డ్రోన్లను తయారు చేయడానికి దేశానికి బలమైన ఉత్పత్తి స్థావరం అవసరమని రాహుల్ గాంధీ తెలిపారు. ఉత్తి మాటలు కాదంటూ ప్రధాని మోదీపై మండిపడ్డారు. ‘డ్రోన్లు కేవలం ఒక సాంకేతికత కాదు, అవి బలమైన పారిశ్రామిక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అయిన ఆవిష్కరణలు. దురదృష్టవశాత్తు దీనిని గ్రహించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారు. ఆయన ఏఐపై ‘టెలిప్రాంప్టర్’ ప్రసంగాలు చేస్తున్నారు. మన పోటీదారులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను నేర్చుకుంటున్నారు. భారతదేశానికి బలమైన ఉత్పత్తి స్థావరం అవసరం, ఉట్టి మాటలు కాదు’ అని విమర్శించారు. డ్రోన్ల భాగాలు దేశంలో తయారు కావడం లేదని, ఆప్టిక్స్ గురించి కూడా తయారుదారులకు అవగాహన లేదని ఆరోపించారు.
మరోవైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను డ్రోన్ ఫెడరేషన్ ఇండియా (డీఎఫ్ఐ) అధ్యక్షుడు స్మిత్ షా ఖండించారు. భారత డ్రోన్ పరిశ్రమను అవమానించేలా నిషేధిత చైనీస్ డ్రోన్‌ను గర్వంగా ప్రదర్శించడాన్ని విమర్శించారు. డ్రోన్ సాంకేతికపై రాహుల్ గాంధీ వాదనలను కూడా తోసిపుచ్చారు. ప్రస్తుతం దేశంలో వివిధ రకాల డ్రోన్లను తయారు చేసే 400కు పైగా కంపెనీలు ఉన్నాయని తెలిపారు.
కాగా, బీజేపీ కూడా రాహుల్ గాంధీపై మండిపడింది. ‘ఇది మరో బుద్ధిహీనమైన, తప్పుడు సమాచారం. పూర్తిగా తప్పుదారి పట్టించే వీడియో’ అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్ పోస్ట్‌లో విమర్శించారు. నిషేధిత డ్రోన్‌ను రాహుల్ గాంధీ ప్రదర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆయనకు నిబంధనలు పట్టవా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ కూడా చైనాను సమర్థిస్తారని ఆరోపించారు. భారతీయ స్టార్టప్‌లు చాలా అధునాతనమైన డ్రోన్లు తయారు చేస్తున్నాయని కౌంటర్ ఇచ్చారు.
Drones have revolutionised warfare, combining batteries, motors and optics to manoeuver and communicate on the battlefield in unprecedented ways. But drones are not just one technology – they are bottom-up innovations produced by a strong industrial system.
Unfortunately, PM… pic.twitter.com/giEFLSJxxv
— Rahul Gandhi (@RahulGandhi) February 15, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Banned
- BJP
- Chinese drone
- Flying
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

