రాహుల్ గాంధీకే పార్టీ పగ్గాలు : సీడబ్ల్యూసీ భేటీలో ముక్తకంఠంతో కోరిన సభ్యులు!

న్యూఢిల్లీ : సోనియా గాంధీ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో సభ్యులందరూ రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలనే ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. నేతలంతా రాహుల్ నాయకత్వానికి మద్దతు పలికారని సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం పార్టీ నేత అంబికా సోని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు అవ్వాలని కాంగ్రెస్ నాయకులందరూ ఏకగ్రీవంగా కోరుకుంటున్నారని అంబికా సోనీ తెలిపారు. 2022 సెప్టెంబర్‌లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని ఆమె చెప్పారు.ఎన్నికల వరకూ రాహుల్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని మరి కొందరు నేతలు సూచించారు.
పార్టీ చీఫ్ బాధ్యతలు మరోసారి చేపట్టేందుకు రాహుల్ సంసిద్ధం
ఇక పార్టీ నేతల ప్రతిపాదనను పరిశీలిస్తానని రాహుల్ స్పష్టం చేశారు. పార్టీ పగ్గాలను చేపట్టాలా లేదా అని తేల్చుకోవాల్సింది రాహుల్ గాంధీయేనని అంబికా సోని పేర్కొన్నారు. దేశ రాజకీయ పరిస్ధితులు, ధరల మంట, వ్యవసాయ సంక్షోభం, రైతులపై దాడుల వంటి అంశాలపై మూడు తీర్మానాలను ఆమోదించామని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ సీడబ్ల్యూసీ భేటీ అనంతరం వెల్లడించారు.
మరోవైపు 2022లో కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విమర్శకుల నోళ్ల మూయించేందుకు తాను పూర్తికాల అధ్యక్షురాలినేనని సోనియా గాంధీ స్పష్టం చేశారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం అనంతరం ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ తప్పుకోవడంతో సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా సీడబ్ల్యూసీ నియమించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclonic storm | ఏపీ, ఒడిశాకు పొంచివున్న తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వాలు..!
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

