రాహుల్ వీడియో వైరల్.. షాంపైన్ బాటిల్‌తో ఉన్న బీజేపీ నేత ఫొటో ట్వీట్ చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేపాల్‌లోని ఓ నైట్ క్లబ్లో ఉన్న ఓ వీడియో దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. దీనిపై అధికార బీజేపీ కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించింది. ఇందులో తప్పేం లేదని కాంగ్రెస్ పేర్కొంటూనే.. బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేవకర్ షాంపైన్‌తో ఉన్న ఫొటోను కాంగ్రెస్ షేర్ చేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెళ్లి కార్యక్రమం ఆయన నేపాల్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన ఖాట్మాండులోని ఓ నైట్‌క్లబ్‌లో ఉన్న వీడియోను బీజేపీ ఐటీ ఇన్చార్జి అమిత్ ట్వీట్ చేశారు.
Who is this ? 😉 pic.twitter.com/dVuiiHGpEL
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) May 3, 2022
ఈ వీడియోపై కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని బీజేపీ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ‘సెలవులు, పార్టీలు, ఆనంద యాత్రలు, ప్రైవేట్ విదేశా పర్యటనలువంటివి దేశానికి కొత్త కాదు’ అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ అధికార ప్రతినిది షాజాద్ పునావాలా స్పందిస్తూ.. రాహుల్ గాంధీ చేస్తున్నది ఆయన వ్యక్తిగత విషయమన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత, ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఓ ఫొటోను ట్వీట్ చేశారు.
Rahul Gandhi was at a nightclub when Mumbai was under seize. He is at a nightclub at a time when his party is exploding. He is consistent.
Interestingly, soon after the Congress refused to outsource their presidency, hit jobs have begun on their Prime Ministerial candidate… pic.twitter.com/dW9t07YkzC
— Amit Malviya (@amitmalviya) May 3, 2022
ప్రకాశ్ జవదేకర్ షాంపైన్ బాటిల్‌తో ఉన్న ఉన్న ఫొటోను ట్వీట్ చేసిన ఆయన ‘ఈయన ఎవరు?’ అంటూ ట్వీట్ చేశారు. రాహుల్ వీడియోపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా స్పందించారు. వివాహానికి హాజరయ్యేందుకు ఖాట్మండు వెళ్లారని, ఇది ఆయన వ్యక్తిగత పర్యటన అని స్పష్టం చేశారు. ఈ దేశంలో ఇప్పటికీ పెళ్లి చేసుకోవడం, ఎవరితోనైనా స్నేహం చేయడం, వివాహ వేడుకలకు హాజరవడం నేరం కాదని, వివాహానికి హాజరుకావడం చట్టవిరుద్ధమని, స్నేహం చేయడాన్ని బీజేపీ నేరంగా పరిగణిస్తోందని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

