Rahul Gandhi | శ్రీరాముడు కాల్పనికం.. రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు కాల్పనిక వ్యక్తి అని వ్యాఖ్యానించారు. వాట్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనను ఓ ప్రశ్న వేశారు.
- కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యలు
- హిందూ వ్యతిరేకి: బీజేపీ
వాషింగ్టన్ : కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు కాల్పనిక వ్యక్తి అని వ్యాఖ్యానించారు. వాట్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనను ఓ ప్రశ్న వేశారు. ‘హిందూ జాతీయవాదం ఆధిపత్యం సాధించిన సమయంలో అన్ని మతాల వారినీ అక్కున చేర్చుకునే లౌకికవాద రాజకీయాలను ఎలా చేయాలి?’ అని ప్రశ్నించారు. దీనికి రాహుల్ సమాధానం చెప్తూ, భారత దేశంలోని సాంఘిక సంస్కర్తలు, రాజకీయ మేధావుల్లో ఎవరూ మత ఛాందసవాదులు కాదన్నారు. బీజేపీ భావజాలాన్ని హిందుత్వంగా తాను పరిగణించనని చెప్పారు. ‘అందరూ కాల్పనిక వ్యక్తులు, శ్రీరాముడు అలాంటి వారిలో ఒకరు. ఆయన క్షమిస్తారు. కరుణామయుడు. బీజేపీ భావనను హిందూ భావనగా నేను చూడను.
ఆలోచనల్లో వారు చిల్లర వ్యక్తుల బృందం. ఇప్పుడు వాళ్లు రాజకీయ అధికారాన్ని లాక్కున్నారు, వాళ్లు పెద్ద ఎత్తున సంపద, అధికారాన్ని పొందారు’ అని రాహుల్ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ, హిందువులను, శ్రీరాముడిని కించపరచడం కాంగ్రెస్ పార్టీ గుర్తింపుగా మారిపోయిందని విమర్శించారు. అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారు, ‘హిందూ ఉగ్రవాదం’ అనే పదాన్ని సృష్టించిన వారు, ఇప్పుడు శ్రీరాముడు కాల్పనిక వ్యక్తి అని అంటున్నారని దుయ్యబట్టారు. రామాలయంలో బాల రాముని ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరు కాలేదని గుర్తు చేశారు. శ్రీరామునిపై, హిందువులపై వారికి గల వ్యతిరేకత దీనిని బట్టి స్పష్టమవుతున్నదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

